నేటి రాశిఫలాలు 28.02.25

మేషం: భూ, గృహయోగాలు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. సోదరులతో సఖ్యత. ధనలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

వృషభం: సన్నిహితులు, మిత్రులతో వివాదాలు తీరతాయి. ఆలయాలు సందర్శిస్తారు. అందరిలోనూ మరింత గౌరవం. వాహనసౌఖ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

మిథునం: కొన్ని పనులు వాయిదా వేస్తారు. బంధువులతో అకారణ వైరం. ఆరోగ్యసమస్యలు. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ. ఆకస్మిక ప్రయాణాలు.

కర్కాటకం: కుటుంబసభ్యులతో వివాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. అరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని సమస్యలు. అనుకున్న పనులు మధ్యలో విరమిస్తారు.

సింహం: నిరుద్యోగుల యత్నాలు సఫలం. స్థిరాస్తి వృద్ధి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూలం. వాహనాలు కొంటారు. పనులు చకచకా సాగుతాయి.

కన్య: కాంట్రాక్టర్లకు మరింత వృద్ధి. కొన్ని ఒత్తిడులు తొలగుతాయి. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. భూలాభం. వ్యవహారాలలో విజయం.. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

తుల: కుటుంబబాధ్యతలు అధికమవుతాయి. పనుల్లో ఆటంకాలు. కుటుంబ సమస్యలు. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో గందరగోళం. పారిశ్రామికవేత్తలకు చిక్కులు.

వృశ్చికం: బంధువులతో విభేదాలు. అనుకోని ప్రయాణాలు. ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు చికాకు పరుస్తాయి. కొన్ని అంచనాలు తప్పుతాయి. బాద్యతలు మరింత పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

ధనుస్సు: ఊహించని∙ఆహ్వానాలు రాగలవు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం. ఉద్యోగలాభం.

మకరం: వ్యవహారాలలో ఆటంకాలు. దూరప్రయాణాలు. బంధువర్గంతో విభేదాలు. అనారోగ్య సూచనలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటుపోట్లు. శ్రమ పెరుగుతుంది.

కుంభం: దూరబంధువుల నుంచి శుభవర్తమానాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

మీనం: ఆస్తి వివాదాలు. బంధువుల నుంచి ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలోనిరుత్సాహం.పరిస్థితులుఅనుకూలించవు.

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *