గ్రామాల అభివృద్ధి బిజెపీతోనే

గద్వాల రూరల్, ఆంధ్రప్రభ: తెలంగాణలో గ్రామాల అభివృద్ధి కేంద్ర ప్రభుత్వ నిధులతోనే సాధ్యమని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ పేర్కొన్నారు. ఆదివారం ఆమె డీకే బంగ్లాలో గద్వాల నియోజకవర్గంలో నూతనంగా గెలిచిన సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, వార్డు మెంబర్లను సన్మానించి అభినందించారు.
దరూర్ మండలం నుండి నిలహళ్లి గ్రామ సర్పంచ్ రంగ రెడ్డి, చిన్న చింత రేవుల సర్పంచ్ రాజేష్ అయ్యా, కాపుల కుంట గ్రామ సర్పంచ్ జయమ్మ శేఖర్ రెడ్డి, నర్సన్ దొడ్డి గ్రామ సర్పంచ్ పర్ణిక రెడ్డి, మన్నా పురం యువరాజ్, కెటి దొడ్డి మండలంలోని పాగుంట గ్రామ సర్పంచ్ అంజనప్ప, ఈర్ల బండ గ్రామ సర్పంచ్ గౌళ్ల సువర్ణమ్మ, సన్మానించారు. ఈ సందర్భంగా డికె. అరుణమ్మ మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ సర్కార్ అందిస్తున్న అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను మరింతగా జనంలోకి తీసుకువెళ్లాలని నూతనంగా ఎన్నికైన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులకు ఎంపీ డీకే అరుణ సూచనలు చేశారు.
కేంద్రంలోని మోదీ సర్కార్ అందిస్తున్న అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, వార్డు సభ్యులు కీలక పాత్ర పోషించాలని. గ్రామాల్లో జరిగే అభివృద్ధి పనులకు కేంద్రం నిధులు అందజేస్తుందని, ఏ పథకానికి ఎంత నిధులు అందజేస్తుందో ప్రజలకు వివరించడం, స్పష్టత ఇవ్వడం బిజెపీ కార్యకర్తల బాధ్యత అని చెప్పారు.
