ఆశీర్వదించి సర్పంచ్‌గా గెలిపించండి..

- మంత్రి వాకిటి శ్రీహరి సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తా
- కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కర్ని గ్రామ సర్పంచ్ అభ్యర్థి దండు రాధ దత్తురాం
మక్తల్, ఆంధ్రప్రభ : రాష్ట్ర పశుసంవర్ధక, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి సహకారంతో కర్ని గ్రామాన్ని స్వర్ణ గ్రామంగా పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తానని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కర్ని గ్రామ సర్పంచ్ అభ్యర్థి దండు రాధ దత్తురాం తెలిపారు. గ్రామ ప్రజలందరూ ఆదరించి తనను సర్పంచ్‌గా గెలిపించాలని ఆమె కోరారు.
ఆదివారం కర్ని గ్రామంలో తన మద్దతుదారులతో కలిసి దండు రాధ దత్తురాం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గ్రామంలో నెలకొన్న వివిధ సమస్యలను పరిష్కరించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. గత పాలకులు ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేశారని, స్థానికుడైన వాకిటి శ్రీహరి ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా ఉండటంతో గ్రామ అభివృద్ధికి మంచి అవకాశం ఏర్పడిందన్నారు.
మంత్రి వాకిటి శ్రీహరి ఈ ప్రాంతాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలనే సంకల్పంతో పనిచేస్తున్నారని, ఆయన మద్దతుతో సర్పంచ్‌గా పోటీ చేస్తున్న తనను ఓటర్లు ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. అభివృద్ధి చేసే మంత్రి ఉన్నప్పుడు ఇతరుల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ బలపరిచిన తనను ఆదరించి గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఇంటింటి ప్రచారం సందర్భంగా గ్రామ ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోందని తెలిపారు. ఈ ఆదరణ ఇలాగే కొనసాగించి ఈ నెల 17న జరగనున్న పోలింగ్‌లో రాజకీయాలకు అతీతంగా గ్రామస్తులంతా కలిసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
తన గెలుపుతో గ్రామ అభివృద్ధికి బాటలు వేస్తామని ఆమె పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను రాజకీయాలకు అతీతంగా అందించడమే లక్ష్యంగా మంత్రి వాకిటి శ్రీహరి పనిచేస్తున్నారని తెలిపారు. గ్రామంలో ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు తాను బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు నిరుపేదలకు అందేలా చూస్తానని గ్రామస్తులకు భరోసా ఇచ్చారు. గ్రామంలోని ప్రతి సమస్యను తెలిసిన వ్యక్తిగా తనను ఆదరించి గెలిపిస్తే, స్థానిక ఎమ్మెల్యే మరియు రాష్ట్ర మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి సహకారంతో కర్ని గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి చూపిస్తానని స్పష్టం చేశారు.
గ్రామ అభివృద్ధికి నిస్వార్థంగా సేవ చేసే భాగ్యం కల్పించాలని ఓటర్లను కోరుతూ, తనను ఆదరించి ఓటు వేసి గెలిపిస్తే కర్ని గ్రామ రూపురేఖలు మారుస్తానని ఆమె అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సభ్యులు చిన్న రంగప్ప, మాజీ సర్పంచ్ రాఘవేంద్ర గౌడ్, బీజేపీ, కాంగ్రెస్ నాయకులు భాస్కర్ రెడ్డి, సత్యనారాయణ గౌడ్, వాకిటి కిష్టప్ప, భగవంతు రెడ్డి, మైబు, భీమేష్ తదితరులు పాల్గొన్నారు.
