SP | నేరగాళ్లకు కౌన్సెలింగ్

SP | నేరగాళ్లకు కౌన్సెలింగ్
- నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలి
- చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండండి
- జిల్లా ఎస్పీ హెచ్చరికలు
SP | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ (SP Sunil Shoran) హెచ్చరికలు జారీ చేశారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు వారి పోలీస్ స్టేషన్ల పరిధిలో నివసిస్తున్న రౌడీ షీటర్లకు, నేరచరిత్ర గలవారికి, చెడు నడత కలిగిన వ్యక్తులకు సత్ప్రవర్తనతో జీవించాలని, నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఆదివారం కౌన్సెలింగ్ నిర్వహించారు. అనంతరం ప్రస్తుతం వారు జీవిస్తున్న విధానం, జీవనోపాధికి చేస్తున్న వృత్తులపై ఆరా తీశారు. అసాంఘిక, చట్ట వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొనరాదని, మీపై నిరంతరం నిఘా ఉంటుందని హెచ్చరించారు.
