INDIA | గుంటూరులో గ్రీన్ ఇండియా ర్యాలీ

INDIA | గుంటూరులో గ్రీన్ ఇండియా ర్యాలీ

INDIA | (గుంటూరు, ఆంధ్రప్రభ) : ప్రత్యామ్నయ, పునర్వినియోగ ఇంధన వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణ ఇంజనీర్ ఎం.డి నజీనా బేగం పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) కాలుష్య నియంత్రణ మండలి, హార్టుఫుల్ నెస్ మెడిటేషన్ కేంద్రం, చలపతి ఫార్మసీ కాలేజీ సౌజన్యంతో జాతీయ ఇందన పరిరక్షణ దినోత్సవంను ఆదివారం నిర్వహించింది. ఇందులో భాగంగా గ్రీన్ ఇండియా రన్ ర్యాలీని ఎన్.టి.ఆర్ స్టేడియం నుండి హార్టుఫుల్ నెస్ మెడిటేషన్ కేంద్రం, నేతాజీ చెరువు ఎదురుగా వెళుతూ, తారకరామా నగర్ ఎక్స్టెన్షన్ వరకు నిర్వహించడం జరిగింది. ర్యాలీలో నజీనా మాట్లాడుతూ ఇంధన వనరులను సమర్థవంతంగా వినియోగించడం, మొక్కలను విరివిగా నాటటం, స్థిరమైన విధానాల ద్వారా ఇందన పొదుపు పాటించాలన్నారు. తద్వారా పర్యావరణాన్ని సంరక్షించేందుకు తోడ్పడుతుందని చెప్పారు.

INDIA

హార్టుఫుల్ నెస్ మెడిటేషన్ కేంద్రం జోనల్ కో-ఆర్డినేటర్ రామ కోటేశ్వర రావు, పర్యావరణ విద్యా జిల్లా సమన్వయకర్త డి.తిరుపతి రెడ్డి, చలపతి కాలేజీ ప్రిన్సిపాల్ రామారావు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ర్యాలీలో(Rally) ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి సిబ్బంది, హార్టుఫుల్ నెస్ మెడిటేషన్ కేంద్రం వాలంటీర్లు, చలపతి ఫార్మసీ కాలేజీ విద్యార్ధులు నగరపాలక సంస్థ ఆరోగ్య అధికారి, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply