Nandyala | అవయవ దానం..

Nandyala | అవయవ దానం..
Nandyala | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : తాను చనిపోయి మరికొందరికి ప్రాణదానం చేసి ఆదర్శంగా నిలిచారు నంద్యాల జిల్లాలో వ్యక్తి. అతని సోదరుడు సురేష్ (Suresh) తెలిపిన వివరాల ప్రకారం.. నంద్యాల జిల్లా ఆత్మకూరుకు చెందిన ప్రశాంత్ చనిపోయి.. తన అవయవాలను దానం చేసి ఆదర్శంగా నిలిచారు. శనివారం బైక్ పై వెళ్తూ పాములపాడు మండలం భానుముక్కల టర్నింగ్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. దీంతో అతని తీవ్ర గాయాలు అయ్యా యి. కర్నూల్ లోని చికిత్స నిమిత్తం ప్రవేట్ ఆసుపత్రిలో చేర్చారు. డాక్టర్లు బ్రెయిన్ డెడ్ అయినట్లు తెలిపారు. అతని కుటుంబ సభ్యులు, అతని అవయవాలను దానం చేయాలని తీర్మానించుకున్నారు. ఆదివారం జీవన్ ధార్ ద్వారా ప్రశాంత్ అవయవాలను కుటుంబ సభ్యులు దానం చేశారు. ఆయన అవయవదానంతో మరికొందరికి ప్రాణదానం చేయడంతో కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
