Bainsa | మరో అవకాశం ఇవ్వండి

Bainsa | మరో అవకాశం ఇవ్వండి

  • దేగాం గ్రామ సర్పంచ్ అభ్యర్థి బొబ్బిలి సరిత శ్రీనివాస్

Bainsa | బైంసా, ఆంధ్రప్రభ : గతంలో త‌న‌కు సర్పంచ్‌గా అవకాశం ఇచ్చారు.. గ్రామ ప్రజలందరూ మెచ్చేలా గ్రామాన్ని అభివృద్ధి చేశాను.. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ రావడంతో నా భార్య బొబ్బిలి సరితను సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిపాను.. మ‌రోసారి అవ‌కాశం ఇవ్వాల‌ని బొబ్బిలి శ్రీ‌నివాస్ కోరారు. ఈ రోజు గ్రామంలో గడపగడప‌కూ ప్రచారం నిర్వహించారు. అదేవిధంగా గ్రామ ఆరాధ్య దైవం స్వర్గీయ మాజీ మంత్రి గడ్డన్న కాక, మాజీ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి, కుటుంబం సహాయo తో మరింత అభివృద్ధి చేస్తారని హామీ ఇచ్చారు. నా సర్పంచ్ హ‌యాంలో మహిళలకు ఆడబిడ్డలకు భైంసాకు వెళ్లి కూరగాయలు తెచ్చుకోవాలంటే ఇబ్బంది అవుతుందని దేగాంలోనే కూరగాయల మార్కెట్‌ను ఏర్పాటు చేశానన్నారు. అలాగే మేకల సంత కూడా సాయిబాబా మందిర్ వద్ద ఏర్పాటు చేశానన్నారు. మరోసారి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

Leave a Reply