POLICE | పోలింగ్ కేంద్రంలో సీపీ

POLICE | పోలింగ్ కేంద్రంలో సీపీ

POLICE | జనగామ, ఆంధ్రప్రభ : జనగామ మండలంలోని శామీర్ పేట గ్రామంలోని పోలింగ్ కేంద్రాన్ని వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రెండవ దశ సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద అత్యధిక పోలీస్ ఫోర్స్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఫలితాలు వెలువడే సమయం వరకు ప్రజలు ఎలాంటి భావోద్వేగానికి లోను కాకుండా, అవాంఛనీయ సంఘటనలకు పాల్పడకుండా సహకరించాలని అన్నారు. సీపీతో పాటు జనగామ ఏసీపీ చేతన్, నితిన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply