Elections | హస్తవాసి తగ్గుతోందా!

Elections | హస్తవాసి తగ్గుతోందా!
- పంచాయతీ ఎన్నికల్లో పల్లెలు చెబుతున్న సత్యమిదే?
- తగ్గుముఖం పడుతున్న అధికార పార్టీ గ్రాఫ్
- అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీకి ఆయువు పోసిన పల్లె ప్రజలు
- నిధుల లేమితో కునారిల్లుతున్న పల్లెసీమలు, పంచాయతీలు
- బలమైన పోరాటం చేయకున్నా బీఆర్ఎస్కు సానుకూల ఫలితాలు
- 6 గ్యారెంటీల అమలులో జాప్యమే కొంప ముంచుతోంది
- అదుపు తప్పిన కొందరు ప్రజాప్రతినిధులు.. అవినీతి సామ్రాట్లుగా ముద్ర
- ఎమ్మెల్యేలపై నియంత్రణ కరువు
- వారి అవినీతికి అదే ఆలంబన
- రాజకీయ విలువల బేరీజుతోనే పల్లె ప్రజలు ఆదరిస్తారన్న అంశాన్ని మరువ తగదని రాజకీయ విశ్లేషకుల సూచన
Elections | ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పల్లె ప్రాంతాలే ఆయువు పోశాయి. అలాంటి పల్లెల్లో పార్టీ వ్యతిరేక పవనాలు వీస్తున్నట్లు గ్రామ పంచాయతీ ఎన్నికల తొలివిడత ఫలితాలు స్పష్టం చేశాయి. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్షానికే పరిమితమైన హస్తం పార్టీ, ఆ తరువాత జరిగిన ఉపఎన్నికల్లో మూడోస్థానంతో సరిపెట్టుకుంది. దీంతో కాంగ్రెస్ పార్టీ ఉనికికే ప్రమాదం పొంచి ఉన్నదని కాంగీయులు కలత చెందుతున్న వేళ, పల్లె ప్రాంతాల ప్రజలు అండగా నిలవడంతో అనూహ్య విజయం సొంతం చేసుకొని రాష్ట్రంలో అధికారం చేపట్టింది.

