Lorry accident | గొర్రెల మందపైకి లారీ..

Lorry accident | గొర్రెల మందపైకి లారీ..
Lorry accident, గూడూరు, ఆంధ్రప్రభ : గూడూరు మండలం పెంచికలపాడు గ్రామం సమీపంలో కోడుమూరు నుండి కర్నూలుకి వెళ్తున్న లారీ.. గొర్రెల మంద పైకి దూసుకెళ్లడంతో 37 గొర్రెలు మృతి చెందినట్లు గొర్రెల కాపరులు తెలిపారు. శనివారం అర్ధరాత్రి జరిగిన ఈ సంఘటన పై గొర్రెల కాపర్లు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ గొర్రెలు తెలంగాణ రాష్ట్రానికి చెందిన కొల్లాపూర్ గ్రామానికి చెందిన వారివిగా గుర్తించారు. 37 గొర్రెలు మృతి చెందడంతో దాదాపు నాలుగు లక్షలకు పైగా నష్టం వాటిల్లిందని గొర్రెల కాపరులు తెలియచేశారు. తమకు ఆర్థిక సాయం అందించి తమను ఆదుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు.
