- మెండోరా సర్పంచ్ అభ్యర్థి కుంట లక్ష్మి రమేష్
భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ: బాల్కొండ నియోజకవర్గం ఇంచార్జి ముత్యాల సునిల్ కుమార్ సహకారంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తానని మెండోరా గ్రామ సర్పంచ్ అభ్యర్థి కుంట లక్ష్మి రమేష్ తెలిపారు. శనివారం భీమ్‌గల్ మండలం మెండోరా గ్రామంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా తాను సర్పంచ్‌గా పోటీ చేస్తున్నానని, తన గుర్తు ఉంగరం గుర్తుకు ఓటు వేయాలని రమేష్ కోరారు. గతంలో సాధారణ వ్యక్తిగా ఉండగా, గ్రామంలోని అర్హులైన 45 మందికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయించడం ద్వారా తన ప్రత్యేక గుర్తింపు వచ్చింది అని పేర్కొన్నారు.
అలాగే, గ్రామాభివృద్ధి కోసం ఇప్పటికే అనేక నిధులను సాధించానని, సర్పంచ్‌గా గెలిపిస్తే గ్రామాన్ని అన్ని రంగాల్లో ఇంకా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.

