Nandyala | అన్నదానంతో సంతృప్తి..

Nandyala | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయడంలో ఉన్న సంతృప్తి మరి ఎక్కడా లేదని, భగవంతుడు కూడా వారిని ఆశీర్వదిస్తాడని కాశిరెడ్డి నాయన ఆశ్రమ నిర్వాహకులు వేలంపల్లి శంకర్ రెడ్డి(Velampalli Shankar Reddy) అన్నారు. శనివారం నంద్యాల మండలం చాపిరేవుల రహదారిలో ఉన్న అవధూత శ్రీ కాశిరెడ్డి నాయన ఆశ్రమంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. దాతల సహకారంతో ఈ నిత్యాన్నదాన సత్రం(Nithyanadana sathram)లో ప్రతి రోజు వందల మంది బాటసారులకు, నిరుపేదలకు అన్నదానం చేస్తున్నామన్నారు. ప్రముఖ నాయకులు మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాశిరెడ్డి నాయన ఆశ్రమంలో భక్తుల సౌకర్యార్థం ఉచిత మినరల్ వాటర్ ఫ్లాంట్ ఏర్పాటు చేశారన్నారు.
