గుంటూరు, ఆంధ్రప్రభ : “ఓటు హక్కు విలువ తెలిసిన వాళ్ళం కాబట్టి ఢిల్లీలో ఎన్ని ముఖ్యమైన పనులు ఉన్నా కేంద్ర మంత్రులతో సమావేశాలు ఉన్నా అన్నింటినీ పక్కన పెట్టి నేను నా ఓటు వేయడానికి వచ్చాను.” అని గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడారు.
ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాల్లో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా కేంద్ర మంత్రి పెమ్మసాని తన ఓటు హక్కును గురువారం వినియోగించుకున్నారు. తెనాలిలోని రావి సాంబయ్య మున్సిపల్ బాయ్స్ హైస్కూల్ లో ఆయన తన ఓటు వేశారు. అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడుతూ… మేధావులు, విజ్ఞానవంతులు, సమాజ శ్రేయస్సు కోరే ప్రతి ఒక్కరూ ఎమ్మెల్సీ ఓటు వెయ్యటానికి ఒక్క గంట సమయం వెచ్చించాలని కోరారు. పట్టభద్రులు వేసే ఈ ఓటు విలువ 6ఏళ్ల అభివృద్ధికి ఊతమిస్తుందని గుర్తు చేశారు.