Development | అభివృద్ధి చేయడం మాటలు కాదు..

Development | అభివృద్ధి చేయడం మాటలు కాదు..

  • చేతల్లో చూపిస్తా
  • పదవి ఆశతో రాలేదు..
  • ప్రజలకు సేవ చేసేందుకు గట్టి ఆశయంతో వచ్చా
  • గుండాల ప్రజలు ఆదరిస్తే గుండెల్లో దాచుకుంటాను
  • కాంగ్రెస్ అభ్యర్థి వాంకుడోత్ బికోజి

Development | ఆళ్లపల్లి, ఆంధ్రప్రభ : గుండాల మండల కేంద్రంతో పాటు, కన్నాయిగూడెం లక్ష్మీపురం, జగ్గయ్యగూడెం, గలభ, పోతిరెడ్డిగూడెం, మటన్లంక, జామరగూడెం, యాపలగడ్డ గ్రామాల్లోని సిపిఐ బలపరిచిన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి వాంకుడోత్ బికోజి హోరాహోరీగా ప్రచారంలో నిమగ్నమయ్యారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ముత్తయ్య, పిఎస్ఆర్- పివిఆర్ మండల కోఆర్డినేటర్ షేక్ ఖదీర్ భుజస్కందాలపై వేసుకొని అభ్యర్థి గెలుపే లక్ష్యంగా అహర్నిశలుగా కృషి చేయడం అభినందనీయం.

అభివృద్ధి మాటలు కాదు, ప్రభుత్వ సహకారంతోనే అభివృద్ధి, సంక్షేమ పథకాలు సాధ్యమవుతుందన్నారు. ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వాంకుడు బీకోజి ఎక్కడికెళ్లినా.. ఏనోట విన్నా కాంగ్రెస్ అభ్యర్థి బికోజి గెలుపు తథ్యం అంటూ, గ్రామాల్లో ప్రజలు బహాటంగానే చర్చించడం శుభపరిణామం. అభివృద్ధి కావాలంటే అధికార పార్టీ కాంగ్రెస్ ఎంతో ముఖ్యమని, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సారధ్యంలోనే అభివృద్ధి సంక్షేమం సఫలీకృతమౌతాయని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మండల యూత్ అధ్యక్షులు అశోక్, అబ్దుల్ నబీ, ఖాసీం, వాంకుడోత్ రమేష్, వాజిద్, ఇస్రాన్, రవి, బొంగుచంద్రశేఖర్, పల్లపు రాజేందర్, సోషల్ మీడియా మండలోజు కిరణ్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply