Messi | కోల్‌కతాలో ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సి
Messi | కోల్‌కతా, ఆంధ్రప్రభ : అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి భారత్ పర్యటనలో భాగంగా మొదటి సారిగా కోల్‌కతాకు చేరుకున్నాడు. 2011 తర్వాత ఈ స్టార్ ఆటగాడు బెంగాల్‌కు రావడం ఇదే తొలిసారి కావడంతో అక్కడి అభిమానుల్లో భారీ ఉత్సాహం నెలకొంది.
కోల్‌కతా టూర్‌లో భాగంగా లేక్‌టౌన్‌లో తన 70 అడుగుల విగ్రహాన్ని వర్చువల్‌గా ఆవిష్కరించనున్నాడు. అనంతరం టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ గంగూలీ, బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ లతో పాటు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీలను కలుస్తాడు. సాయంత్రం హైదరాబాద్‌కు చేరుకోనున్నాడు. గోట్ కప్ పేరుతో ఉప్పల్ స్టేడియంలో నిర్వహించే ఎగ్జిబిషన్ ఫుట్‌బాల్ మ్యాచ్‌లో ఆడతాడు.

