Geminids Show : వావ్..వెలుగు పూల వాన

Geminids Show : వావ్..వెలుగు పూల వాన
జెమినీడ్ ఉల్కాపాతం రెడీ
స్కై గేజర్ల కెమెరాలు సిద్ధం
ఇక అర్ధ రాత్రి కనువిందే
రెండు రోజులు హ్యాపీ హ్యాపీ
( ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్)
నిశీథి రాత్రి ..విరహ వేదనతో ఆకాశంలో వెతికితే.. దొరికేది ఒక తార. కానీ ఈ తార నుంచి వెలుగు పూల వాన కురుస్తుంటే.. అబ్బా ఆ ఆనుభూతే వేరబ్బా. భారత దేశంలో దీపావళి వేళ.. ఇలా వెలుగు పువ్వుల వర్షంలో తడిచేది లేదు..కానీ కళ్లార చూసి యావత్తు భారతావని పరమానంద భరితమౌతుంది.
Geminids Show

రాతి ఉల్క 3200 ఫేథాన్ ( Phaethon) నుండి ఉద్భవించాయి, అత్యంత ప్రకాశవంత నక్షత్రం క్యాస్టర్ (Star Castor) సమీపం నుండి దూసుకెళ్తుంటాయి. అందుకే వీటికి జెమినిడ్స్ అంటారు మందపాటి, అద్భుత వెలుగు ధారలను పంచుతాయి. జెమినిడ్స్ ఉల్కాపాతం ( Geminids Meteor) 20 నుంచి 25 తేదీ వరకూ ఆకాశంలో కనువిందు చేస్తాయి. ప్రస్తుతం వీకెండ్ కావటంతో.. భారత దేశంలో అనేక ప్రాంతాల్లో స్కైవాచర్లు (Sky Watchers) .. రెడీ టూ క్లిక్ అంటూ తమ కెమెరాలను సిద్ధం చేస్తున్నారు. అసలీ జెమినిడ్ ఉల్కాపాతం ఉంటే ఏమిటీ? భారత దేశంలో ఏయే ప్రాంతాల్లో కనువిందు చేస్తుంది? తెలుసుకుందాం.
Geminids Show : ఇండియాలో వీక్షణ ప్రాంతాలు
జెమినీడ్ ఉల్కావర్షం .. డిసెంబర్ 13 నుంచి -14 రాత్రి (మధ్యరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు, (సుమారు 12 AM నుంచి 4 AM వరకు) పీక్ దశలో ఉంటుంది. చందమామ నెలవంక చీకటి యానంలోకి (waning crescent phase) చేరుతున్న వేళ గంటకు 100.. -120 ఉల్కలు నేల జారుతుంటాయి.
Geminids Show : వీక్షణానికి ఏ ప్రాంతమంటే..

కాంతి కాలుష్యం లేని ప్రాంతాన్ని ఎంచుకోవాలి. వీక్షణ ప్రాంతం చీకటిగా ఉంటే అంత మంచిది. తక్కువ స్థానిక లైటింగ్ ఉన్న పైకప్పు టెర్రస్, గ్రామ మైదానం, బహిరంగ ఉద్యానవనం లేదా హిల్ స్టేషన్, వ్యూ పాయింట్ నుంచి అద్భుత కాస్మిక్ షోను చూడవచ్చు. అడ్డంకులు లేని హోరిజోన్ చాలా ముఖ్యమైనది,
ఉత్తరాఖండ్ లో ఎత్తైన హిమాలయ ప్రాంతాలు ముక్తేశ్వర్ (Mukteshwar), కౌసాని (Kausani) , చీకటి ఆకాశం. ఇక్కడ స్టార్ స్కేప్స్ ఆబ్జర్వేటరీలు ఉంటాయి. ఈ సందర్భంగా గైడెడ్ ఈవెంట్స్ కూడా జరుగుతాయి. ఇక కర్ణాటకలోని పశ్చిమ కనుమల్లో కూర్గ్ (Coorg) ఘాట్స్ కాఫీ ఎస్టేట్స్ లో ఉల్కాపాతం వీక్షణానికి స్కైవాచర్లు వెళ్తారు.
Geminids Show

మహారాష్ట్ర లోని ముంబైకి సమీపంలోని భండార్దారా (Bhandardara), లోనార్ క్రేటర్ (Lonar Crater) తదితర స్టార్ గేజింగ్ ఈవెంట్స్ ప్రాంతాలు సిద్ధంగా ఉన్నాయి. రాజస్థాన్ లోని సంభార్ లేక్ (Sambhar Lake) , జైసల్మేర్ పరిసర ఎడారి ప్రాంతాలు. లడఖ్ హన్లే (Hanle) ఇండియాలోనే మొదటి డార్క్ స్కై రిజర్వ్, అత్యంత చీకటి ఆకాశ ప్రాంతం ఇది.
కానీ చలి ఎక్కువగా ఉంటుంది. తమిళనాడులో నీలగిరి హిల్స్, మేఘాలయలో షిల్లాంగ్ ప్లాటో హిమాచల్ ప్రదేశ్ లోని హిమాలయ ఫుట్‌హిల్స్ గుజరాత్ లోని స్పితి వ్యాలీ, రన్ ఆఫ్ కచ్ ఆంధ్రప్రదేశ్ లోని అరకు వ్యాలీ (Araku vally) మేఘాల గడ్డ .. ఈ ప్రాంతాలు స్కైవాచర్లు ఆనుకూలం . సాధారణంగా సిటీలకు దూరంగా ఉండే గ్రామీణ ప్రాంతాలు, ఓపెన్ ఫీల్డ్స్, హిల్ టాప్స్ లేదా రూఫ్‌టాప్స్ మంచివే. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, ఇలా ప్రముఖ నగరాల్లో ఓపెన్ పార్క్స్ లేదా అవుట్‌స్కర్ట్స్ లోనూ స్కైవాచర్లు ట్రై చేస్తుంటారు.
Geminids Show : ఆకాశంలో ఏమి జరుగుతుందంటే

భారతదేశంలో అర్ధరాత్రి నుండి తెల్లవారుజామున వరకు, తూర్పు ఆకాశంలో మిథున రాశి (Jemini) పైకి లేచే వరకు జెమినిడ్ ఉల్కాపాతం ఉంటుంది. నిజానికి మిథున రాశిని ఖచ్చితంగా గుర్తించాల్సిన అవసరం లేదు, కానీ రాత్రి గడిచేకొద్దీ అది పైకి కదులుతుందని తెలుసుకొంటే ఉల్కాపాత సెషన్‌కు సమయం గుర్తించవచ్చు.
కనీసం ఒక గంట పరిశీలించాలని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఉల్కలు తరచుగా (Meteors Break) పగిలిపోతాయి. ఆ వెలుగులను తట్టుకునేలా కళ్ళు చీకటిని సర్దుబాటు చేసుకోవడానికి సమయం పడుతుంది. మిథున రాశి నుంచి జెమినిడ్ ఉల్కలు వెలువడుతున్నట్లు కనిపిస్తాయి. కానీ ఆకాశంలోని ఏ భాగంలో నైనా విస్తరించగలవు.
కొన్ని ఉల్కలు మందంగా, సూది లాంటి మెరుపులుగా ఉంటాయి, మరికొన్ని అద్భుత అగ్నిగోళాలు (Fire balls) గా పేలి శాశ్వత ముద్రలను వదిలివేస్తాయి. ప్రతి స్ట్రీక్ (Every Streak) భూమి పైన సెకనుకు పదుల కిలోమీటర్లు మండుతున్న కాస్మిక్ ధూళి (Cosmic Dust) ని గుర్తు చేస్తుంది.
Geminids Show : టెలీస్కోప్ తో పని లేదు

టెలిస్కోప్ (Tele Scope) లేదా బైనాక్యులర్లు (Binaculars) అవసరం లేదు. నిజానికి, ఇ వి వీక్షణ క్షేత్రాన్ని పరిమితం చేస్తాయి. చాప (Mat) లేదా వాలు కుర్చీ Slide Chair) పై వెల్లకిల పడుకోవాలి. వెచ్చని దుస్తులు (worm Dress) ధరించాలి. కళ్ళు పూర్తిగా సర్దుబాటు కావటానికి , చూడటానికి 20 నుంచి 30 నిమిషాల ముందు ఫోన్‌ను దూరంగా ఉంచాలి. రాత్రి దృష్టిని కాపాడటానికి ఎరుపు సెల్లోఫేన్‌తో టార్చ్ ని కప్పండి.
నిశీథి రాత్రి ..విరహ వేదనతో ఆకాశంలో వెతికితే.. దొరికేది ఒక తార. కానీ ఈ తార నుంచి వెలుగు పూల వాన కురుస్తుంటే.. అబ్బా ఆ ఆనుభూతే వేరబ్బా. భారత దేశంలో దీపావళి వేళ.. ఇలా వెలుగు పువ్వుల వర్షంలో తడిచేది లేదు..కానీ కళ్లార చూసి యావత్తు భారతావని పరమానంద భరితమౌతుంది.
కృత్రిమ పుష్ప జల్లులకే ఇలా మైమరచి పోయే జనం.. సహజ సిద్ధ వెలుగుల.. జిలుగుల పూల జల్లుల..జడిలో ఆ తనమయం వర్ణనాతీతం. ఔను డిసెంబరు నెల వచ్చిందంటే.. భారతీయులే కాదు.. యావత్తు ప్రపంచంలోని స్కై గేజర్లు (Sky Gazers) సర్వసన్నద్ధం అవుతుంటారు. ఏన్నాళ్లో వేచిన ఉదయం కాదు.. అర్ధరాత్రి వచ్చేస్తోంది. అద్భుత ఉల్కాపాతం జెమినిడ్స్ (Geminids Show)సమయం వచ్చేసింది.
డిసెంబర్ 13 (శనివారం) డిసెంబర్ 15 తెల్లవారు జాము వరకూ ఉల్కాపాతం కురుస్తుంది. ఒకటి కాదు.. రెండు కాదు.. గంటకు 100 కంటే ఎక్కువ ఉల్కలను కనువిందు చేస్తాయి. సినిమాటిక్‌గా గ్రాఫిక్ లను తలదన్నే రీతిలో మిరుమిట్లగొలిపే ప్రకాశవంతమైన గీతలు ఆకాశంలో నేలజారుతుంటాయి. తోకచుక్కలు, సాధారణ ఉల్కాపాతం మాదిరి కాదు…
ALSO READ : Australia Ban : నో డిస్ట్రక్ట్.. బాల్యం
