ఆశతో కాదు, ఆశయంతో మీ ముందుకు వస్తున్నా..

- ఆదరించండి, అభివృద్ధిలో గ్రామాన్ని ముందుకు తీసుకెళ్తా
భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : గ్రామ అభివృద్ధే తన లక్ష్యమని, ప్రజలు ఇచ్చే మద్దతుతో గ్రామ సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానని బాబాపూర్ గ్రామ బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి మహమ్మద్ సూర్జిల్ అన్నారు.
గ్రామ ప్రజలతో కలిసి గ్రామ అభివృద్ధి పథంలో ముందుకు సాగేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతూ, సూర్జిల్ శుక్రవారం గ్రామంలోని ఇంటింటికి వెళ్లి ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు వివరిస్తూ, కత్తెర గుర్తుకు ఓటు వేస్తూ భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
సూర్జిల్ మాట్లాడుతూ, “ఎంపీటీసీ అనుభవంతో సర్పంచ్ బరిలో మీ ముందుకు వచ్చినాను. మీ అమూల్యమైన ఓటు వేసి ఆశీర్వదిస్తే, గెలిచిన వెంటనే ప్రభుత్వం ద్వారా వచ్చే సంక్షేమ పథకాలు గ్రామ అభివృద్ధికి ఉపయోగపడతాయి. గ్రామంలో అమ్మాయిల వివాహాలకు కల్యాణ లక్ష్మి, పేద ప్రజలకు ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్యం కోసం సిఎంఆర్, ఎల్ఓసి వంటి పథకాలు అందించటం మొదలుపెడతాను. గెలవక ముందే పథకాలను లబ్ధిదారులకు చేరేలా కృషి చేశాం” అని తెలిపారు.
సర్పంచ్‌గా గెలిచాక మరింతగా గ్రామ అభివృద్ధికి తోడ్పడతానని సూర్జిల్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అభ్యర్థి సూర్జిల్ వెంట అభిమాన నాయకులు, మహిళలు, యువకులు, వివిధ సంఘాల సభ్యులు, పేదవారు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
