Govt | గ్రామాల అభివృద్ధికి సహకరిస్తాం…
Govt | నిజాంపేట, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తేనే గ్రామాలలో అభివృద్ధి సాధ్యమవుతుందని మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంతో పాటు కల్వకుంట, గ్రామాలలో ఈ రోజు ఎన్నికల ప్రచారం(election campaign)లో భాగంగా డప్పు చప్పుల్లు, బోనాలు, మంగళ హారతుల మధ్య ఆయనకు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్థానిక గ్రామ సర్పంచ్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తేనే గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. నిజాంపేటలో పంజా మహేందర్, కల్వకుంటలో రంగా రాజాకిషన్(Raja Kishan)ను భారీ మెజార్టీతో గెలుపొందించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో కెసిఆర్ కుటుంబం దోచుకోవడం దాచుకోవడమే పని పెట్టుకున్నారని అరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం(Govt) అధికారంలోకి వచ్చి రెండేళ్లలోనే అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందన్నారు. గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలుపొందిస్తే గ్రామాల అభివృద్ధికి సహకరిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నిజాంపేట కల్వకుంట గ్రామాల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

