Pligrimage Tragedy అంతలోనే ఆనందం ఆవిరి.. Andhra Prabha Detail Report
5 గురు మహిళల సహా 9 మంది దుర్మరణం
– మృతుల్లో చిత్తూరు జిల్లా, బెంగుళూరు వాసులు
– ఘాట్ లో టూరిస్టు బస్సు బోల్తా
– 10 మందికి తీవ్ర గాయాలు,
మరో 11 మంది స్వల్ప గాయాలు
7 గురు మృత్యుంజయులు
– బస్సులో మొత్తం 37 మంది యాత్రికులు
- 35 మంది మధ్య తరగతి జీవులు. నిత్యం ఈతిబాధలు వీళ్లకు అలవాటే. ఒక్కసారి పుణ్యక్షేత్రాల్లో పర్యటించి ఆ దేవుళ్లను మొక్కి .. ఈ కష్టాలను తీర్చమని కోరుదాం. వెళ్తే పోయేది ఏముందీ ? అనుకున్నారు. చిత్తూరులో గణపతికి కొబ్బరి కాయకొట్టి విఘ్నేశ్వర ట్రావెల్స్ బస్సు ఎక్కారు. ఆధ్యాత్మిక యాత్ర ఎంతో ఉల్లాసంగా.. ఉత్సాహంగా సాగింది. కోటప్ప కొండలో శివయ్యకు దండం పెట్టారు. పంచానామాల్లో ముకుళిత హస్తాలతో శివ తాండవం చేశారు. సింహాచలం అప్పన్న సన్నిధిలో పులకిరించి పోయారు. అరసవిల్లిలో బాల భానుడి స్పర్శతో పరవశించారు. ఇక ఆంధ్రా ఊటీ అందాల రాసి అరకు లోయలో కేవలం కొన్ని గంటలే .. ఆనందంలో మునిగి తేలారు. ఇక భద్రాద్రి రాములోరి దర్శనంతో .. ఇక తమ కష్టాలు గట్టెక్కుతాయని బయలేరిన వేళ.. మారేడు మిల్లి ఘాట్ లో మృత్యువు మాటు వేసిన సంగతి ఊహించలేదు. అతి వేగంగా దూసుకుపోతున్న ఈ బస్సు పల్టీలు కొట్టింది. ఆ క్షణంలో ఏమి జరుగుంతో ఎరుగని అలసట నిద్ర ఎగిరి పోయింది. కళ్ల ముందే రక్తంలో 9 మంది సహచరులు నిర్జీవులు కాగా.. మరో 21 మంది అరుపులు..కేకలు ఆ లోయలో మార్మోగాయి. 7గురు మృత్యుంజయులకు ఏమి చేయాలో పాలుపోలేదు.. ఇదీ .. వర్ణనాతీత హృదయ విదారక సన్నివేశం. అధికారులు .. మంత్రులు పరుగు పరుగునా వచ్చారు. క్షతగాత్రులను ఓదార్చారు. మృతుల కుటుంబాలకు రూ.7లక్షల పరిహారం ప్రకటించారు.
(చింతూరు, ఆంధ్రప్రభ)
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని చింతూరు – మారేడుమిల్లి ఘాట్ రోడ్లో ఘోర ప్రమాదం (Pligrimage Tragedy) జరిగింది. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందగా 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇదే ఘటనలో మరో 11 మందికి స్వల్ప గాయాలవ్వగా 7 గురు సురక్షితంగా బయటపడ్డారు

Pligrimage Tragedy
ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. చిత్తూరు (Chittor) జిల్లాతో పాటు బెంగుళూరు (Bangalore) కి చెందిన కొందరు యాత్రికులు ఈ నెల 6 వ తేది రాత్రి చిత్తూరు నుండి దైవ దర్శనాలతో పాటు పర్యాటక ప్రాంతాలను తిలకించేందకు శ్రీ విఘ్నేశ్వర ట్రావెల్స్‌కి చెందిన ( Sri Vugneswara Travels) ఏపీ 39 యూఎం 6543 ప్రైవేట్ బస్సులో బయలుదేరారు. చిత్తూరు నుండి బయలుదేరిన యాత్రికులు దైవ దర్శనాలు దర్శిస్తూ కోటప్పకొండ, ద్వారక తిరుమల, పాలకొల్లు, భీమవరం, పెనుగొండ, అంతర్వేది, ద్రాక్షరామం, సామర్లకోట, సింహాచలం, అరసవల్లి పుణ్యక్షేత్రాలను దర్శించి అక్కడ నుండి అరకు అందాలను తిలకించేందుకు గురువారం అరకు చేరుకున్నారు. అరకు పర్యటన ముగించికొని అక్కడ నుండి భద్రాచలంలోని శ్రీ సీతారామస్వామి దర్శనం కోసం భద్రాచలం (Badrachalam) బయలుదేరాఉ.
Pligrimage Tragedy

మారేడుమిల్లి మీదుగా వస్తుండుగా ప్రమాదవశాత్తు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు చింతూరు – మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో చింతూరు మండలం తులసీపాక (Tulasi Paka) గ్రామం నుండి సుమారు 7 కిలో మీటర్ల దూరంలోని శ్రీ వన దుర్గమ్మ ఆలయం దాటిన తరువాత చైనా వాల్ (China wall) గా పిలవబడే పెద్ద గోడకి అతి సమీపంలో మూలమలపు వద్ద బస్సు సుమారు శుక్రవారం తెల్లవారు జామున 3.15 – .. 4.00 గంటల మధ్య సమయంలో రోడ్డు ప్రక్కకి వెళ్ళి బోల్తా పడింది.
Pligrimage Tragedy : అక్కడిక్కడే 9 మంది మృతి

చింతూరు – మారేడుమిల్లి ఘాట్ (Maredumilli Ghat) రోడ్డులో జరిగిన ఘోర ప్రమాదంలో 9 మంది యాత్రికులు ( 9 dead Spot) అక్కడక్కడే మృతి చెందారు. బస్సు బోల్తా పడిన సంఘటనలో 9 మంది దుర్మరణం చెందారు. చిత్తూరు నుండి దైవదర్శనాలతో (Piligrimage) పాటు విహారయాత్రగా మొదలైన వారి ప్రయాణం మన్యంలో మధ్యలోనే విషాదం ( Turn Sad) గా ముగిసింది.

ఈ మృతుల్లో 5 గురు మహిళలతో (5 Women) పాటు మరో నలుగురు మృతి చెందారు. ఈ ఘటనలో మృతి చెందిన వారి వివరాలు ఇలా ఉన్నాయి. చిత్తూరు జిల్లా పలమానేరుకు చెందిన సునంద, గిరినిపేటకు చెందిన శ్రీ కళ, తిరుపతి జిల్లాకు చెందిన శ్యామల, గుంటూరు జిల్లా తెనాలికి చెందిన శైలజరాణి, బెంగుళూరు కేఆర్పురంకు చెందిన కృష్ణకుమారి అనే 5 గురు మహిళలు మృతి చెందగా, చిత్తూరు జిల్లా పలమనేరుకి చెందిన శివ శంకర్ రెడ్డి, అదే జిల్లాకి చెందిన ఎస్వి నాగేశ్వరరావు, మురుగన్పాటుకు చెందిన దొరబాబు, బెంగుళూరు ఎంఎస్ రామాలయం నగర్‌కి చెందిన కావేరి క్రిష్ణ అనే నలుగురు మృత్యువాత పడ్డారు.
1Pligrimage Tragedy : 0 మందికి తీవ్ర గాయాలు

చింతూరు-మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 10 మందికి తీవ్ర గాయాలవ్వగా మరో 11 మందికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ బస్సులో మొత్తం 37 మంది ప్రయాణిస్తుండుగా అందులో 7 గురుకి (7 Safe) ఎటువంటి దెబ్బలు తగలకుండా సురక్షితంగా బయట పడ్డారు. ఈ బస్సులో వారు 6 వ తేదీ దైవ దర్శనాలతో పాటు విహార యాత్ర పేరుతో వివిధ పుణ్య క్షేత్రాలు దర్శిస్తూ వచ్చి ఘోర రోడ్డు ప్రమాదంలో (Fatal Accident) ఇలా అనంతలోకాలకు వెళ్ళడంతో తీవ్ర విషాదఛాయలు అలమకున్నాయి

. బస్సు బోల్తా పడిన ఘటన స్థలం నుండి మృతి చెందిన మృతదేహాలను, గాయపడ్డ క్షతగాత్రులను హుటాహుటిన 108 వాహనాల ద్వారా చింతూరు సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులకు చింతూరు డీప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్ పుల్లయ్య, చింతూరు సీహెచ్‌సీ పర్యవేక్షణాధికారి డాక్టర్ కోటీ రెడ్డిల పర్యవేక్షణలో వైద్యులు ప్రధమ చికిత్సలతో ఆవసరమైన చికిత్సలను అందించారు.
Pligrimage Tragedy : కదలిన మంత్రులు

చింతూరు మండలంలోని ఘాట్ రోడ్డులో జరిగిన బస్సు ప్రమాదంలో మృతి చెందిన 9 మంది మృతుల కుటుంబాలను, గాయపడ్డ క్షతగాత్రులను ముగ్గురు రాష్టృ మంత్రులు ( Three Ministers ) పరామర్శించారు. రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపుడి అనిత, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి, జిల్లా ఇంఛార్జ్ మంత్రి గుమ్మడి సంధ్యరాణి, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డిలతో రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ సోళ్ళ బోజ్జి రెడ్డి, రంపచోడవరం ఎమ్మేల్యే మిరియాల శీరిషాదేవిలు చింతూరు – మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో జరిగిన బస్సు ప్రమాద ఘటనస్థలాన్ని సందర్శించి పరీశీలించడంతో పాటు చింతూరు సీహెచ్‌సీలో ఉన్న మృతుల కుటుంబ సభ్యులను, గాయపడ్డ క్షతగాత్రులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
ప్రభుత్వం ఆదుకుంటుంది

బస్సు ప్రమాదంలో మృతి చెందిన మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉండటంతో పాటు ఆదుకుంటుందని రాష్ట్ర మంత్రులు పేర్కోన్నారు. బస్సు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబ సభ్యులను, క్షతగాత్రులను పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లు ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంధిని వ్యక్తం చేశారని వారు తెలిపారు.

ఆసుపత్రిలో క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు ఇతర వైద్యశాలలో వైద్యం అందించేందుకు సిద్దంగా ఉందన్నారు. మృతదేహాలను స్వస్థలాలకు చేర్చడంతో పాటు క్షతగాత్రులను భద్రంగా ఇళ్ళకు చేర్చడానికి అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. ఏఎస్ఆర్ జిల్లా కలెక్టర్, ఎస్పీలు పర్యవేక్షణలో వారి వారి స్వస్థలాకు పంపేందకు ఏర్పాట్లు చేస్తున్నామని చిత్తూరు జిల్లా కేంద్రానికి వెళ్ళిన తరువాత అక్కడ నుండి వారి స్వగ్రామాలకు పంపించడానికి చిత్తూరు జిల్లా కలెక్టర్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు.
రూ. 7 లక్షల ఏక్స్గ్రేషియా

చింతూరు – మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో జరిగిన ఘోర ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలతో పాటు గాయపడ్డ క్షతగాత్రులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏక్స్గ్రేషియా ప్రకటించినట్లు రాష్ట్ర హోంమంత్రి వంగలపుడి అనిత తెలిపారు. మృతి చెందిన మృతుల కుటుంబాలకు రాష్ట్రం ప్రభుత్వం రూ. 5 లక్షలు, కేంద్ర ప్రభుత్వం రూ. 2 లక్షలు మొత్తం రూ. 7 లక్షలు ( 7Lakhs Ex Gratia) ఒక్కోక్క మృతుని కుటుంబానికి ఏక్స్గ్రేషియా ప్రకటించడం జరిగిందన్నారు. అదే విధంగా తీవ్రంగా గాయపడ్డ క్షతగాత్రులకు ప్రభుత్వం రూ. 2 లక్షలు, స్వల్పంగా గాయపడ్డ క్షతగాత్రులకు రూ. 50 వేలు ఏక్స్గ్రేషియా ప్రకటించడం జరిగిందన్నారు.
Pligrimage Tragedy : ఫ సహాయక చర్యలు భేష్

చింతూరు మన్యంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాద విషయం తెలుసుకున్న ఏఎస్ఆర్ జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, ఎస్పీ అమిత్ బర్ధర్ అధికారయంత్రాంగాన్ని అప్రమత్తం చేసి సహాయక చర్యలు చేపట్టారు. చింతూరు ఐటీడీఏ పీవో శుభం నోఖ్వాల్, ఏఎస్ఆర్ జిల్లా ఓఎస్డీ పంకజ్ కుమార్ మీనా, చింతూరు ఏఎస్పీ హేమంత్ పర్యవేక్షణలో పోలీస్, రెవెన్యూ, పంచాయతీ రాజ్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

ప్రమాద ఘటన స్థలం నుండి చింతూరు వైద్యశాలలో చికిత్సలు అందించేంత వరకు వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తీవ్రంగా కష్టపడి పని చేసి సహాయక చర్యలు అందించారు. చింతూరు సీఐ గోపాల క్రిష్ణ, ఎస్సై పేరూరి రమేష్, మోతుగూడెం ఎస్సై సాధిక్లు సంఘటన స్థలానికి చేరుకొని 108 వాహనాలు, అంబులెన్స్‌లు ద్వారా మృతదేహాలను, క్షతగాత్రులను వైద్యశాలకు తరలించారు. వైద్య చికిత్సలందించడానికి నాల్గు మండలాలను నుండి వైద్యులు, వైద్య సిబ్బంది వచ్చి సేవలందించారు.
ALSO READ : ముఖ్యాంశాలు
KOTEKAL DEATH CURVE | మృత్యువు మలుపే

