Local Soft Ware : సాఫ్ట్ వేర్ ఇక లోకల్
- గన్నవరంలోనే ట్రైనింగ్
- జనవరి నుంచి ప్రారంభం
- హెచ్ సీఎల్ తో చర్చలు
- ఏపీ ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెల్లడి
Local Soft Ware : (ఆంధ్రప్రభ, గన్నవరం) : ఇంజనీరింగ్ పూర్తి చేసిన పట్టభద్రులకు గన్నవరంలోనే సాఫ్ట్ వేర్ శిక్షణ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే (Ap Wip) యార్లగడ్డ వెంకట్రావు (Yarlagadda Venkata Rao) తెలిపారు. ప్రస్తుతం ఇంజనీరింగ్ పూర్తి చేసిన పట్టభద్రులు సాఫ్ట్ వేర్ రంగంలో శిక్షణ కోసం ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి హైదరాబాద్ లాంటి నగరాలకు తరలి వెళ్తున్నారని ఇలాంటి ( Local Engireeing Graduates) స్థానికంగానే శిక్షణ ఇచ్చేలా హెచ్.సి.ఎల్ సంస్థ (HCL Represantatives) ప్రతినిధులతో సంప్రదింపులు జరుపుతున్నామని యార్లగడ్డ పేర్కొన్నారు. తమ ప్రయత్నాలు ఫలించి జనవరి నుంచి ( From Jaunavary) ఇక్కడే శిక్షణ కార్యక్రమాలు (Trainning) నిర్వహిస్తామన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు.

గన్నవరంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో నాలుగవ పిల్లల పండుగ, బాలోత్సవం (Balotsavam) కార్యక్రమాన్ని శుక్రవారం ఉదయం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో యార్లగడ్డ మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు స్థానికంగానే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా కృషి చేస్తున్నట్లు చెప్పారు. నియోజకవర్గంలో ప్రస్తుతం పాఠశాల్లో తొమ్మిది, పది, చదువుకుంటున్న విద్యార్థులందరూ చదువు పూర్తి చేసుకునే నాటికి స్థానికంగానే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అహర్నిశలు కృషి చేస్తున్నారని రాష్ట్ర బడ్జెట్ను పది రెట్లు పెంచిన ఘనత చంద్రబాబు కే సాధ్యమైందన్నారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చేసిన కృషి వల్లే విశాఖపట్నంలో 17 మిలియన్ డాలర్లు ( 17 Million Dollars) పెట్టుబడితో గూగుల్ సంస్థ ఏర్పాటు అవుతుంది అన్నారు.

పిల్లల భవిష్యత్తు బాగుండాలని తల్లిదండ్రులు ఎన్నో కష్టాలను భరించి చదివిస్తున్నారని వారి కష్టాన్ని గుర్తించి బాగా చదువుకొని ఉన్నత స్థానాలు చేరుకోవాలని ఆకాంక్షించారు. చిన్నారుల్లో దాగివున్న సృజనాత్మకతను (Creativity) , ప్రతిభ ను వెలికితీసేందుకు బాలోత్సవాలు ఉపయోగపడతాయన్నారు. ఇటువంటి మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన నిర్వాహకులని యార్లగడ్డ అభినందించారు. ఈకార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు గూడపాటి తులసిమోహన్, ఇంచార్జ్ సర్పంచ్ పాలడుగు నాని, ఎంపిటిసి పడమట రంగారావు, నాయకులు దేవినేని సులోచన, బోడపాటి రవి, చిమటా రవివర్మ, నిర్వాహకులు పూర్ణచంద్రరావు, కర్ర వరప్రసాద్, గన్నే వెంకట్రావ్, మద్దూకూరి విజయకుమార్, కొల్లి సత్య జగదీశ్వరరావు, జాస్తి విజయ భూషణ్ కుమార్, అనుమోలు వెంకటేశ్వరరావు, హెచ్.ఏం కోడె పార్వతి తదితరులు పాల్గొన్నారు. ఈసందర్బంగా యార్లగడ్డ విద్యార్థినివిద్యార్థులతో కరచలనం చేస్తూ, ఫోటోలు దిగుతూ వారిని ఉత్సాహపరచారు.


