Rally | గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చుతా

Rally | గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చుతా

Rally | ధర్మపురి, ఆంధ్రప్రభ : తనను ఒకసారి సర్పంచ్ గా అవకాశం కల్పిస్తే కమలాపూర్ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చి మండలంలోని ఉన్నతంగా నిలబెడతానని కమలాపూర్ సర్పంచ్ అభ్యర్థి కుమ్మరి తిరుపతి ఓటర్లను అభ్యర్థించారు. గ్రామంలోని వివిధ వాడలలో ర్యాలీ(Rally)గా తరలివెళ్లి ఇంటింటా ప్రచారం చేశారు.

ఉంగరం గుర్తుకు ఓటు వేయాలని కోరారు. గ్రామంలోని ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఆశీర్వదించారు. తనకు ఒకసారి అవకాశం కల్పిస్తే తన మార్పు చూపిస్తూ గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని కేంద్రం నుండి బండి సంజయ్(Bandi Sanjay) సహకారంతో గ్రామానికి నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తానని ఒక సేవకునిగా గ్రామానికి సేవ చేసే అవకాశం ప్రజలు కల్పించాలని ఆయన ఓటర్లను కోరారు.

Leave a Reply