State Govts | గెలిపిస్తే ఖానాపూర్ అభివృద్ధి చేస్తా.

State Govts | గెలిపిస్తే ఖానాపూర్ అభివృద్ధి చేస్తా.

State Govts | మక్తల్, ఆంధ్రప్రభ : ఓటు వేసి ఆదరించి గెలిపిస్తే ఖానాపూర్ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని నారాయణపేట జిల్లా మక్తల్ మండల పరిధిలోని ఖానాపూర్ బీజేపీ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి బోయ అనిత అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల(State Govts) సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తానని అన్నారు. ఈ రోజు ఖానాపూర్ గ్రామంలో తన మద్దతుదారులతో కలిసి ప్రచారాన్ని ముమ్మరం చేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామంలో నెలకొన్న వివిధ సమస్యలు పరిష్కరించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు. నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయించే బాధ్యత తీసుకుంటానని అన్నారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు నిరుపేదలకు అందించే విధంగా చూస్తానని గ్రామంలోని ప్రతి సమస్యను తెలుసుకున్న వ్యక్తిగా నన్ను ఆదరించి గెలిపిస్తే గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి చూపిస్తానని అన్నారు.

గ్రామ అభివృద్ధికి నిస్వార్ధంగా సేవ చేసే భాగ్యం కల్పించాలని ఓటర్లకు విజ్ఞప్తిచేశారు. గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేయడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు(welfare schemes) అర్హులైన ప్రతి ఒక్కరికి పారదర్శకంగా అందిస్తానని అన్నారు. ఆదరించి ఓటు వేసి గెలిపిస్తే గ్రామ రూపురేఖలు మారుస్తూ డ్రైనేజీలు నిర్మిస్తానని అన్నారు.

Leave a Reply