Collector | ప్రశాంతంగా మొదటి విడత ఎన్నిక

Collector | ప్రశాంతంగా మొదటి విడత ఎన్నిక

  • రెండవ, మూడవ విడత ఎన్నికకు అన్ని ఏర్పాట్లు పూర్తి
  • జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్

Collector | జనగామ, ఆంధ్రప్రభ : వివిధ శాఖల అధికారుల టీమ్ వర్క్ తో మొదటి విడత ఎన్నికలు సజావుగా ముగిశాయ‌ని, 14, 17వ తేదీల్లో జరిగే రెండు, మూడవ విడత ఎన్నికలను కూడా అదే రీతిలో జరిగేలా పనిచేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్(Rizwan Basha Sheikh) అన్నారు. ఇవాళ‌ రెండవ, మూడవ విడత ఎన్నికల నిర్వహణ మీద అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్, జడ్పీ సీఈఓ, తహసీల్దార్, ఎంపీడీఓ, ఇతర పోలింగ్ అధికారులతో కలెక్టర్ గూగుల్ మీటింగ్(Google Meeting) ద్వారా రివ్యూ చేసారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… రెండవ, మూడవ విడత పోలింగ్ ముందు రోజు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లను సరిగ్గా నిర్వహించాలని, చెక్ లిస్ట్ ప్రకారం పోలింగ్ మెటీరియల్(Polling material) పంపిణీ జరగాలని, పోలింగ్ కేంద్రాల్లో అన్ని మౌలిక సదుపాయాలు ఉండాలని, ఓటింగ్ కి సంబంధించి ఇచ్చే నివేదికలన్నీ పూర్తి సమాచారంతో ఉండాలన్నారు. వార్డ్, సర్పంచ్ ఎన్నికకు సంబంధించిన బ్యాలెట్ పేపర్ రెండింటిని ఓటర్లు బ్యాలట్ బాక్స్ లో వేయాలని, అలాగే రెండింటి మీద స్వస్తిక్(Swastik) గుర్తును ఇంక్ తో పూర్తి గా అంటించి ఓటర్లు పెట్టాలన్నారు.

ఈ అంశం మీద అక్కడ ఉండే పోలింగ్ అధికారులు ఓటర్లకు తెలియజేయాలన్నారు. పోలింగ్(Polling) అయిపోగానే రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు.. కౌంటింగ్ ప్రక్రియ జాగ్రత్తగా జరగాలని, వేగవంతంగా జరిగేందుకు అవసరమగు సిబ్బందిని నియమించుకోవాలన్నారు. ఉప సర్పంచ్ ఎన్నిక ప్రక్రియ కూడా వెంటనే అయిపోవాలన్నారు. తహసీల్దార్, ఎంపీడీఓ, మండల స్పెషల్ అధికారులు సమన్వయంగా పనిచేసి పోలింగ్ ప్రశాంత వాతావరణంలో జరిగేలా కృషి చేయాలన్నారు.

Leave a Reply