Neeraja | సర్పంచ్ గా గెలిపిస్తే ..
- అభివృద్ధి చేసి చూపిస్తా
- గొల్లపల్లి సర్పంచ్ అభ్యర్థి నల్ల నీరజ సతీష్ రెడ్డి
Neeraja | గొల్లపల్లి, ఆంధ్రప్రభ : గొల్లపల్లి సర్పంచిగా గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని గొల్లపల్లి సర్పంచ్ అభ్యర్థి నల్ల నీరజ సతీష్ రెడ్డి అన్నారు. ఇవాళ ఇంటింట ప్రచారం నిర్వహించిన నీరజ సతీష్ రెడ్డి మాట్లాడుతూ… గ్రామంలో పేరుకుపోయిన సమస్యలన్నింటిని గెలిచిన తర్వాత తీరుస్తానని హామీ ఇచ్చారు. గొల్లపల్లి ప్రజలకు తమ కుటుంబం చేసిన సేవలు గుర్తుంటాయన్నారు. తమ కుటుంబం బడుగు, బలహీన వర్గాల వైపే ఉంటుందన్నారు. పానా గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.

