Foundation | విద్యార్థులకు బ్యాగుల పంపిణీ…

Foundation | విద్యార్థులకు బ్యాగుల పంపిణీ…

Foundation | దండేపల్లి, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని గుడిరేవు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ రోజు గుమ్మడి రాజలింగు ఫౌండేషన్(Foundation) ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, విద్యార్థులు చదువుకోవడానికి సంబంధించిన బుక్స్ మెటీరియల్స్(Materials) ను ఫౌండేషన్ వ్యవస్థాపకుడు గుమ్మడి కిరణ్ చేతుల మీదుగా అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థుల భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని వారి ప్రోత్సాహం కోసం మరింత ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశ్యంతో పని చేస్తానని అన్నారు. చేసిన ప్రతి చిన్న సహాయం విద్యార్థుల(students)కు ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, ఉపాధ్యాయులు, యువకులు అనిల్, సునీల్, నరేష్, పవన్, శేఖర్, ఉదయ్, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply