IT MINISTER | 12 నెలల్లో వాణిజ్య కార్యకలాపాలు
- విశాఖలో ఏసీఎన్ ఇన్ఫోటెక్ కు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన
IT MINISTER | విశాఖపట్నం, ఆంధ్ర ప్రభ బ్యూరో : విశాఖ ఐటీ సెజ్ హిల్ నెం-2లో ఏసీఎన్ ఇన్ఫోటెక్కు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఏసీఎన్ హెల్త్ కేర్ ఆర్సీఎం సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ (Private limited) సంస్థ విశాఖ యూనిట్ ద్వారా రూ.30 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. తద్వారా 600 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.
ఏసీఎన్ ఇన్ఫోటెక్ సంస్థ 12 నెలల్లో తన వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించనుంది. ఈ కార్యక్రమంలో ఏసీఎన్ ఇన్ఫోటెక్ సీఈవో చమన్ బేడ్, సీటీవో (CTO) అమవ్ బేడ్, ఎంపీ శ్రీ భరత్, జిల్లా ఇంఛార్జ్ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఏపీఐఐసీ ఛైర్మన్ మంతెన రామరాజు, ఐటీ సెక్రటరీ కాటంనేని భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

