Government Welfare | సర్పంచ్ అభ్యర్థికి మద్దతుగా భారీ ర్యాలీ
Government Welfare | మక్తల్, ఆంధ్రప్రభ : జూరాల ప్రాజెక్టులో ముంపుకు గురైన అనుగొండ గ్రామానికి పునరావాస కేంద్రం కల్పిస్తున్న మక్తల్ ఎమ్మెల్యే రాష్ట్ర పశుసంవర్ధక క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరికి(Minister Dr. Vakiti Srihari) కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి సంధ్య ఆంజనేయులు భారీ మెజారిటీతో గెలిపించి మంత్రికి కానుకగా ఇద్దామని మాజీ ఎంపీపీ అధ్యక్షుడు గడ్డంపల్లి హనుమంతు, అనుగొండ గ్రామ మాజీ సర్పంచ్ గడ్డం రమేష్ గ్రామస్తులకు పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ పార్టీ మద్దతుతో సర్పంచ్ గా పోటీ చేస్తున్న అభ్యర్థి సధ్య ఆంజనేయులుకు మద్దతుగా ఈ రోజు గ్రామంలో మహిళలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ కూడలి వద్ద సమావేశంలో వారు మాట్లాడుతూ.. గ్రామంలో నెలకొన్న వివిధ సమస్యలు పరిష్కరించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని అన్నారు.
ఎన్నికల్లో ఆదరిస్తే గ్రామ సర్వతోముగా అభివృద్ధికి కృషి చేయడంతో ప్రభుత్వ సంక్షేమ(Government Welfare) పథకాలు అర్హులందరికీ అందించేందుకు కృషి చేస్తామని వారు హామీ ఇచ్చారు. సౌమ్యులైన సంధ్య ఆంజనేయులు గ్రామ అభివృద్ధికి నిస్వార్ధంగా సేవ చేసే భాగ్యం కల్పించాలని ఓటర్లను విజ్ఞప్తిచేశారు. గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేయడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి పారదర్శకంగా అందిస్తామనిఅన్నారు.

ఆదరించి ఓటు వేసి గెలిపిస్తే మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి సహకారంతో పునరావాసం పనులు పూర్తి చేయించి అభివృద్ధికి పాటుపడతారని అన్నారు. ప్రతిపక్ష పార్టీల(Opposition Parties) నాయకులు చెప్పే మాయమాటలు నమ్మి మోసపోయి గోసపడవద్దని విజ్ఞప్తి చేశారు .గ్రామ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ మద్దతుతో పోటీ చేస్తున్నఅభ్యర్థి సంధ్య ఆంజనేయులు ను భారీ మెజారిటీతో సర్పంచ్ గా గెలిపించవల్సిందిగా వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అభ్యర్థి సంధ్య ఆంజనేయులు, కొండప్ప, యం. కొండప్ప, అంజన్న, తాయప్ప, లక్ష్మన్న, లొకన్న, వెంకటన్న, శివ, ఆంజనేయులు, నర్సింహులు, భీమన్న, రాము తదితరులు పాల్గొన్నారు.

