Errabelli | కేసీఆర్ హయాంలోనే గ్రామాల అభివృద్ధి..
ఉంగరం గుర్తుకు ఓటు వేయండి
Errabelli | పెద్దవంగర, ఆంధ్రప్రభ : సర్పంచ్ ఎన్నికల సందర్భంగా శుక్రవారం పెద్దవంగర మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి నిమ్మల విజయ శ్రీనివాస్ తరపున మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా దయాకర్ రావు మాట్లాడుతూ.. కేసీఆర్ హయంలోనే గ్రామాల అభివృద్ధి జరిగిందని, పెద్దవంగర మండల కేంద్రాన్ని కేసీఆర్ ప్రభుత్వం అభివృద్ధి చేసిందని, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేయలేదని, క్షేత్రస్థాయిలో ఇంటింటి ప్రచారం చేస్తూ వివరించారు. డిసెంబర్ 14న జరిగే సర్పంచ్ ఎన్నికల్లో ఉంగరం గుర్తుకు ఓటు వేసి నిమ్మల విజయ శ్రీనివాస్ ను ఆశీర్వదించాలని కోరారు.


