Leaders Shocked 2 :  క్షతగాత్రులకు ఓదార్పు   

Leaders Shocked 2 :  క్షతగాత్రులకు ఓదార్పు   

 ఎస్టీ కమిషన్ చైర్మన్..  ఎమ్మెల్యే పరామర్శ  

( ఆంధ్రప్రభ ,  చింతూరు)    

 అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మారేడుమిల్లీ ఘాట్ రోడ్డులో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో , తొమ్మిది మంది మృతి చెందగా మరో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి ఇదే ఘటనలో మరో 11 మందికి స్వల్పంగా గాయపడ్డారు.  చింతూరు మారేడి మిల్లీ ఘాట్ రోడ్లో విహార యాత్రికుల ప్రయాణిస్తున్న బస్సు లోయలోపడి విషయం తెలుసుకున్న (Leaders Shocked 2   ఏపీ ఎస్టీ కమీషన్ చైర్మన్ సోల్ల బొజ్జరెడ్డి, రంపచోవడం ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి ముందుగా ఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు.

Leaders Shocked 2 :  క్షతగాత్రులకు ఓదార్పు

 బస్సు ప్రమాదానికిగల కారణాలని అడిగి తెలుసుకున్నారు. అక్కడ నుండి చింతూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సలు పొందు తున్న క్షత గాత్రూలను   పరామర్శించారు. ప్రమాదంలో మృతి చెందిన మృత దేహాలను సందర్శించి ప్రగాఢ సానుభూతినీ తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈఅత్యంత బాధాకరమని  దిగ్బంతిని వ్యక్తం చేశారు. క్షత్ర గాత్రులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకొని అండగా ఉంటుందని క్షత గాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తామని భరోసా ఇచ్చారు.

ALSO READ : At China Wall Fatal Accident  :  9 మంది దుర్మరణం

Also READ :    Leaders Shocked :  బస్సు బోల్తాపై  చలించిపోయారు

Leave a Reply