Hill No. 2 | యువతకు అద్భుత అవకాశాలు
- విశాఖలో నాన్ రెల్ టెక్నాలజీస్ కు మంత్రి నారా లోకేష్ భూమిపూజ
Hill No. 2 | విశాఖపట్నం, ఆంధ్ర ప్రభ బ్యూరో : విశాఖ నాన్ ఐటీ సెజ్, హిల్ నెంబర్-2లో నాన్ రెల్ టెక్నాలజీ(Non-reel technology) యూనిట్‌కు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు హిల్ నెంబర్-2(Hill No. 2)లోని సంస్థ ప్రాంగణానికి చేరుకున్న మంత్రి లోకేశ్‌కు నిర్వాహకులు ఘనస్వాగతం పలికారు. విశాఖలో ఏర్పాటుకానున్న నాన్ రెల్ టెక్నాలజీస్ సంస్థ రూ.50.60 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. తద్వారా 567 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.

కార్యక్రమంలో నాన్ రెల్ టెక్నాలజీస్ ఎండీ వినయ్ బాబు(MD Vinay Babu) మేక, సీఈవో పవన్ కుమార్ సామినేని, ఎంపీ శ్రీ భరత్, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఏపీఐఐసీ ఛైర్మన్ మంతెన రామరాజు, ఐటీ సెక్రటరీ కాటంనేని భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.


