Bhumi Puja | రూ.62 కోట్ల పెట్టుబడి..

Bhumi Puja | రూ.62 కోట్ల పెట్టుబడి..

  • విశాఖలో టెక్ తమ్మిన సంస్థకు మంత్రి లోకేష్ శంకుస్థాపన

Bhumi Puja | విశాఖపట్నం, ఆంధ్రప్రభ బ్యూరో : విశాఖ మధురవాడలోని హిల్ నెంబర్-2లో టెక్ తమ్మిన ఐటీ సంస్థ క్యాంపస్ నిర్మాణానికి విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ భూమిపూజ చేశారు. ముందుగా హిల్ నెం-2లోని సంస్థ ప్రాంగణానికి(company premises) చేరుకున్న మంత్రి లోకేశ్‌కు నిర్వాహకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం టెక్ తమ్మిన సంస్థ భవన నిర్మాణానికి మంత్రి లోకేష్(Lokesh) శంకుస్థాపన చేశారు. టెక్ తమ్మిన సంస్థ విశాఖ యూనిట్ ద్వారా రూ.62 కోట్లు పెట్టుబడి పెట్టనుంది.

Bhumi Puja

తద్వారా 500 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం అమెరికాలో ఉంది. నెదర్లాండ్స్, దుబాయ్, ఇండియాలో తన సేవలను(his services) అందిస్తోంది. ఈ కార్యక్రమంలో టెక్ తమ్మిన సీఈవో రాజ్ తమ్మిన, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సంతోష్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ కేవీఎస్జేవీ శాస్త్రి, ఎంపీ శ్రీ భరత్, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఏపీఐఐసీ ఛైర్మన్ మంతెన రామరాజు, ఐటీ సెక్రటరీ కాటంనేని భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply