AMC Vice Chairman | ఆయ‌న సేవ‌లు మ‌రువ‌లేనివి

AMC Vice Chairman | ఆయ‌న సేవ‌లు మ‌రువ‌లేనివి

  • తెలుగు భాష అభివృద్ధికి మండలి కుటుంబం కృషి
  • ఘంటసాల ఏఎంసీ వైస్ చైర్మన్ అత్తలూరి గోపిచంద్
  • మండ‌లి వెంక‌ట కృష్ణారావుకు కూటమి మహిళల ఘన నివాళులు

AMC Vice Chairman | అవనిగడ్డ, ఆంధ్రప్రభ : తెలుగు భాష అభివృద్ధికి మండలి కుటుంబం దశాబ్దాలుగా కృషి చేస్తోందని ఏఎంసీ వైస్ చైర్మన్ అత్తలూరి గోపిచంద్ (Gopichand) అన్నారు. శుక్రవారం అవనిగడ్డ వంతెన సెంటరులో ఉమ్మడి రాష్ట్ర మంత్రి స్వర్గీయ మండలి వెంకట కృష్ణారావు శత జయంతి వేడుకలు కూటమి మహిళా నేతల ఆధ్వర్యంలో నిర్వహించారు. కృష్ణారావు విగ్రహానికి గోపీచంద్, తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి తాడికొండ వెంకటేశ్వరరావు (చిన్నా), మాజీ ఎంపీపీలు బండే కనకదుర్గ, మోర్ల జయలక్ష్మి, ఏఎంసీ డైరెక్టర్ పిరాటి శిరీష, దేవస్థానం డైరెక్టర్లు మత్తి శివపార్వతి, అన్నపరెడ్డి వెంకటేశ్వరమ్మ, మాజీ డైరెక్టర్ విశ్వనాథ‌పల్లి పాప, ఆకుల సీతా మహాలక్ష్మి, బాలమ్మ నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా గోపిచంద్ మాట్లాడుతూ.. ప్రపంచ తెలుగు మహాసభల ద్వారా కృష్ణారావు (Krishna Rao) ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారిని ఏకం చేస్తే, వారి కుమారుడు ఎమ్మెల్యే డాక్టర్ మండలి బుద్ధప్రసాద్ యూనికోడ్ తెలుగు ఫాంట్స్ తయారు చేయించి అంతర్జాతీయంగా అంతర్జాలంలో తెలుగు పతాకాన్ని సంగర్వంగా ఎగురవేశారన్నారు. ఉమ్మడి రాష్ట్ర అధికార భాషా సంఘ చైర్మన్‌గా తెలుగు భాష అభివృద్ధికి, తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు, న్యాయస్థానాల్లో తెలుగులో తీర్పుల సాధనకు కృషి చేశారన్నారు.

మండలి వెంకట కృష్ణారావు శత జయంతి కమిటీ, గాంధీ క్షేత్రం, మండలి అభిమానుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్, ఏఎంసీ చైర్మన్ (AMC Chairmen) కొల్లూరి వెంకటేశ్వరరావు, టీడీపీ మండల అధ్యక్షులు యాసం చిట్టిబాబు, జనసేన ఉమ్మడి జిల్లా అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాల్, టీడీపీ టౌన్ అధ్యక్షులు అన్నపరెడ్డి లక్ష్మీనారాయణ, డీసీ వైస్ చైర్మన్ బచ్చు రఘునాథ ప్రసాద్, టీడీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు మాచవరపు ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.

AMC Vice Chairman

Leave a Reply