Opportunity | మార్పు కోరండి.. అవకాశం ఇవ్వండి
Opportunity | ధర్మపురి, ఆంధ్రప్రభ : గ్రామ ప్రజలు ఒక్కసారి మార్పు కోరుకొని.. తనను సర్పంచ్ గా గెలిపించాలని కోసునూరు పల్లె సర్పంచ్ అభ్యర్థి మౌనిక మధుకర్ రెడ్డిలు కోరారు.
గురువారం గ్రామంలో ఇంటింటా తిరుగుతూ ఉంగరం గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. ఒక్కసారి సర్పంచ్ గా అవకాశం(opportunity) కల్పిస్తే ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరిస్తూ.. గ్రామాన్ని అభివృద్ధి(development) చేస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సహకారంతో గ్రామానికి అత్యధిక నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.

