ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా నేడు (బుధవారం) ముంబై ఇండియన్స్ – యూపీ వారియర్స్ మహిళల జట్లు తలపడనున్నాయి. బెంగళూరు వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్.. బౌలింగ్ ఎంచుకుని యూపీ వారియర్స్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.
జట్టు మార్పులు :
ముంబై ఇండియన్స్ ఒక మార్పు: పరుణికా సిసోడియా స్థానంలో జింటిమణి కలితా తుది జట్టులోకి వచ్చింది
తుది జట్లు :
యుపి వారియర్స్ ఉమెన్ : కిరణ్ ప్రభు నవ్‌గిరే, దినేష్ వృందా, దీప్తి శర్మ (కెప్టెన్), గ్రేస్ హారిస్, సైమా ఠాకోర్, శ్వేతా సెహ్రావత్, తహ్లియా మెక్‌గ్రాత్, ఉమా చెత్రీ (వికెట్ కీపర్), చినెల్లే హెన్రీ, క్రాంతి గౌడ్, సోఫీ ఎక్లెస్‌స్టోన్.
ముంబై ఇండియన్స్ ఉమెన్ : యాస్తికా భాటియా (వికెట్ కీపర్), హేలీ క్రిస్టెన్ మాథ్యూస్, నాట్ స్కివర్-బ్రంట్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), అమేలియా కెర్, అమంజోత్ కౌర్, సజీవన్ సజన, G కమలిని, సంస్కృతి గుప్తా, షబ్నిమ్ ఇస్మాయిల్, జింటిమణి కలిత.
పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో నిలిచేందుకు ఐదు జట్లు ఐదు జట్లు తమ అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్నాయి. ప్రస్తుతం డబ్ల్యూపీఎల్ పాయింట్ల పట్టికలో ఢిల్లీ క్యాపిటల్స్ 6 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత ఆర్సీబీ (4), ముంబై ఇండియన్స్ (4), యూపీ వారియర్స్ (4), గుజరాత్ టైటన్స్ (2) ఉన్నాయి.
అయితే 6 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్న ఢిల్లీ నెట్ రన్ రేట్ (-0.22) గా ఉంది. మరోవైపు ఆర్సీబీ (0.619), ముంబై (0.610), యూపీ (0.167), గుజరాత్ (-0.97) ఉన్నాయి.
దీంతో నేటి మ్యాచ్‌లో ముంబై లేదా యూపీ ఏ జట్టు గెలిచినా మెరుగైన రన్ రేట్ కారణంగా… ఆ జట్టు పాయింట్స్ టేబుల్లో అగ్రస్థానానికి చేరుకోవడం ఖాయం.