bus facility | ఆదరించండి.. అభివృద్ధి చేస్తా..

bus facility | ఆదరించండి.. అభివృద్ధి చేస్తా..

  • సమస్త పూర్ స్వతంత్ర అభ్యర్థి కాశమ్మ

bus facility | ఊట్కూర్, ఆంధ్రప్రభ : ఆదరించి ఓట్లు వేసి గెలిపిస్తే నారాయణపేట జిల్లా పెద్దపోర్ల గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని సర్పంచ్ స్వతంత్ర అభ్యర్థి బోయినపల్లి కాశమ్మ అన్నారు. ఈ రోజు ఊట్కూర్ మండల పరిధిలోని పెద్దపోర్ల గ్రామంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామంలో నెలకొన్న వివిధ సమస్యలు పరిష్కరించేందుకు(resolve) శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు.

గత పాలకుల నిర్లక్ష్యం కార‌ణంగా గ్రామ అభివృద్ధికి నోచుకోలేదని, మహిళగా ఆదరిస్తే గ్రామ సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయడంతో పాటు బస్సు సౌకర్యం(bus facility) కల్పిస్తానన్నారు. త‌న‌ను గెలిపిస్తే కట్ట వద్ద అధ్వానంగా ఉన్న రహదారికి మరమ్మతు చేయిస్తాన‌న్నారు. గ్రామ అభివృద్ధికి నిస్వార్ధంగా సేవ చేసే భాగ్యం కల్పించాలని ఓటర్లను విజ్ఞప్తిచేశారు.

గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేయడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతీ ఒక్కరికి పారదర్శకంగా అందిస్తానన్నారు. త‌న‌ను గెలిపిస్తే ప్రభుత్వ సంక్షేమ పథకాలు(welfare schemes) పారదర్శకంగా మంజూరు చేయించి ప్రజల రుణం తీర్చుకుంటానన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రవి కుమార్, మాజీ ఎంపీటీసీ శివ పాల్గొన్నారు.

Leave a Reply