Tension | పంచాయతీ పోలింగ్ కేంద్రం వద్ద టెన్షన్

Tension | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : నల్గొండ జిల్లాలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలోని పోలింగ్ కేంద్రం వద్ద రెండువర్గాల నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, డైరీ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి ఒకరిపై ఒకరు మాటల యుద్ధానికి దిగడంతో అక్కడి పరిస్థితి క్షణక్షణం ఉద్రిక్తంగా మారింది. పోలింగ్ కేంద్రం వద్ద అటూ–ఇటూ చేరిన వారి అనుచరులు కూడా ఒకదశలో మాటకు మాట పెరగడంతో పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ప్రస్తుతం పోలింగ్ సవ్యంగా కొనసాగుతున్నట్టు అధికారులు తెలిపారు.
