MOBILE | 5జీ సెల్‌ఫోన్ల అంద‌జేత

MOBILE | పామర్రు, ఆంధ్రప్రభ : పామర్రు నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ప్రధాన, మినీ అంగన్వాడీ కార్యకర్తలకు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా 5జీ సెల్‌ఫోన్లను అందజేశారు. అంగన్వాడీ కార్యకర్తల పనిభారాన్ని తగ్గించేందుకు స్మార్ట్‌ఫోన్ల పంపిణీ చేయాల‌ని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మ‌క‌మ‌ని ఎమ్మెల్యే చెప్పారు. దీని ద్వారా గ్రామీణ స్థాయిలో పోషణ, ఆరోగ్య సేవల అమలు మరింత పారదర్శకంగా, వేగంగా జరుగుతుంద‌న్నారు. మినీ కార్యకర్తలకు మెయిన్ అంగన్వాడీ కార్యకర్తలుగా తాత్కాలిక నియామక ఉత్తర్వులను అందజేశారు. కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply