Blockbuster | మెగా హీరో నిర్ణయం సరైనదేనా..?
Blockbuster | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : మె గా హీరో తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్(Blockbuster) సాధించాడు.. ఆతర్వాత మాత్రం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో వరుస ఫెయిల్యూర్స్ నుంచి బయటపడడం కోసం కొంత గ్యాప్ తీసుకున్నాడు. ఎన్నో కథలు విన్నాడు. సరైన కథ సెట్ కాకపోవడంతో కొత్త సినిమా స్టార్ట్ చేయలేదు.
ఇప్పుడు కొత్త సినిమాకి పచ్చజెండా ఊపాడని ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తోంది. అయితే.. ప్లాప్ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ.. సక్సెస్(success) కోసం తపిస్తున్న ఆ.. మెగా హీరో ఎవరు..? ఈ హీరోకి కథ చెప్పి ఓప్పించిన ఆ.. ప్లాప్ డైరెక్టర్ ఎవరు..?
తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ సాధించిన మెగా హీరో వైష్ణవ్ తేజ్. ఉప్పెన సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించిన వైష్ణవ్ తేజ్.. ఆతర్వాత చేసిన కొండపొలం, రంగ రంగ వైభవంగా, ఆదికేశవ సినిమాలు బాక్సాఫీస్(box office) దగ్గర డిజాస్టర్స్ గా నిలిచాయి. దీంతో ఉప్పెనతో వచ్చిన క్రేజ్ పోయింది. అందుకనే.. ఈ మెగా హీరో ఫామ్ లోకి రావాలని తపిస్తున్నాడు కానీ.. సరైన స్టోరీ సెట్ మాత్రం కాకపోవడంతో కొత్త సినిమాని పట్టాలెక్కించలేదు.
ఇదిలా ఉంటే.. ఇటీవల ప్రవీణ్ సత్తారు చెప్పిన కథకు ఈ మెగా హీరో ఓకే చెప్పాడట. ఈ కథ పై దర్శకుడుకి బాగా నమ్మకం ఉండడంతో ఈ సినిమా నిర్మాణంలో కూడా పార్టనర్ గా జాయిన్ అవుతానని చెప్పాడని ఇండస్ట్రీ సర్కిల్స్(industry circles) లో వినిపిస్తుంది.
ఈ న్యూస్ లీకైనప్పటి నుంచి ప్లాప్ డైరెక్టర్ తో వైష్ణవ్ తేజ్(Vaishnav Tej) సినిమా చేయబోతున్నాడా..? అనే టాక్ వినిపిస్తుంది. ఆమధ్య డైరెక్టర్ పరశురామ్ పేరు వినిపించింది. వీళ్లిద్దరు చెప్పిన కథలే కాకుండా చాలా కథలు విన్నప్పటికీ.. ఏ తరహా సినిమా చేయాలనే విషయంలో మాత్రం నిర్ణయం తీసుకోలేకపోతున్నాడని టాక్.

ప్రవీణ్ సత్తారు ప్రాజెక్ట్ కన్ ఫర్మ్ అంటూ జోరుగా ప్రచారం అయితే జరుగుతోంది. ప్రవీణ్ సత్తారు టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్(Filmmaker). రోటీన్ లవ్ స్టోరీ, చందమామ కథలు, గుంటూరు టాకీస్, గరుడవేగ, ది ఘోస్ట్, గాంఢీవధారి అర్జున సినిమాలను తెరకెక్కించారు.
అయితే.. ఇటీవల ప్రవీణ్ సత్తారు.. నాగార్జునతో తెరకెక్కించిన ది ఘోస్ట్ మూవీ ప్లాప్ అయ్యింది. వరుణ్ తేజ్ తో తీసిన గాంఢీవధారి(Gandhian) అర్జున కూడా ఫ్లాప్ అయ్యింది. ఆతర్వాత ఇంత వరకు కొత్త సినిమా స్టార్ట్ చేయలేదు.
ఈ సినిమాలు ఫ్లాప్ అయినా.. అతనిలో టాలెంట్ మాత్రం నిండుగా ఉంది. ఈసారి ఎలాగైనా సరే సక్సెస్ సాధించాలనే పట్టుదలతో సినిమా చేయాలి అనుకుంటున్నాడట. మరి.. వైష్ణవ్ తేజ్.. ప్రవీణ్ సత్తారు కాంబో నిజంగా సెట్ అవుతుందా..? అయితే కనుక ఎలా ఉండబోతుందో క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

