Indaram | అభివృద్ధి చేసి చూపిస్తా..

Indaram | అభివృద్ధి చేసి చూపిస్తా..

Indaram, జైపూర్, ఆంధ్రప్రభ : జైపూర్ మండలం ఇందారం గ్రామం బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కొరివి శేఖర్ కు ఒక్కసారి అవకాశం కల్పిస్తే.. గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తానంటూ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. గడప గడపకు ప్రచారం చేస్తూ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులకు సంబంధించి ఓటర్లకు వివరించారు.

ఉంగరపు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తూ ప్రచారంలో దూసుకెళుతున్నారు. గ్రామ సమస్యల పట్ల అవగాహన ఉందని.. సర్పంచ్ గా తనను గెలిపిస్తే.. ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరిచి, గ్రామంలో మురికి కాల్వలు, సీసీ రోడ్ల నిర్మా ణాలను పూర్తి చేసి ఇందారం గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందు ఉంచుతానని ఓటర్లకు హామీ ఇస్తున్నారు.

Leave a Reply