returning | పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పగడ్బందీ ఏర్పాట్లు

returning | పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పగడ్బందీ ఏర్పాట్లు

  • పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లిన ఎన్నికల ఉద్యోగులు

returning | జైనూర్, ఆంధ్రప్రభ : కొమరం భీం అసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలో గురువారం జరిగే గ్రామపంచాయతీ సర్పంచ్ వార్డు మెంబర్ల మొదటి విడత ఎన్నికల నిర్వహణకు మండల రిటర్నింగ్ అధికారి సుధాకర్ రెడ్డి, మండల పంచాయతీ అధికారి భుఖ్య శశి కుమార్ అధికారులు ఉద్యోగులు పగడ్బందీ ఏర్పాట్లు చేశారు.

మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల(Secondary school) ఎంఆర్సి ఆవరణలో బుధవారం ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మండలంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఆరు రూట్లు లో జోనల్ అధికారులను నియమించారు. 26 గ్రామపంచాయతీ సర్పంచుల పోటీకి 104 మంది అభ్యర్థులు బరిలో ఉండగా 50 వార్డు మెంబర్లకు ఎన్నికలు జరగనున్నాయి.

ఎన్నికల నిర్వహణకు మండల రిటర్నింగ్(returning) అధికారితో పాటు ఆరుగురు జూనాల అధికారులు 26 మంది రిటర్నింగ్ అధికారులు 700 మంది పైగా ఎన్నికల ఉద్యోగులు సిబ్బంది పాల్గొంటున్నారని మండల రిటర్నింగ్ అధికారి సుధాకర్ రెడ్డి, మండల పంచాయతీ అధికారి శశి కుమార్ తెలిపారు. ఎన్నికల సామాగ్రి కేంద్రాన్ని ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ నితిక పంత్ జిల్లా అధికారులు, సందర్శించి పరిశీలించారు.

ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై ఎస్పీ నితిక పంత్ మండల రిటర్నింగ్ అధికారితో పలు విషయాలు చర్చించారు. ఎస్పీ పోలీస్ అధికారుల(police officers)తో మాట్లాడుతూ ఎన్నికల్లో ఎలాంటి గొడవలు జరగకుండా ముందస్తు గట్టి చర్యలు తీసుకోవాలని ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలిసింది.

ఈ సామాగ్రి పంపిన కార్యక్రమంలో జిల్లా అధికారులు బానోత్ దత్తారం, గుణవంత్ రావు, ఇతర శాఖల అధికారులు ఉద్యోగులు, ఎన్నికల ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.

మండలంలో 26 గ్రామ పంచాయతీల సర్పంచ్, వార్డు సభ్యులకు ఎన్నికల నిర్వహించడానికి విధులు పడ్డ ఎన్నికల అధికారులు ఉద్యోగులు వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు ప్రత్యేక బస్సుల్లో బ్యాలెట్ బాక్సులు(ballot boxes) ఎన్నికల సామాగ్రి తీసుకొని ఆరు రూట్లలో జోనల్ అధికారుల, పోలీస్ అధికారుల, భద్రత పర్యవేక్షణలో తరలి వెళ్లారు. పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగే విధంగా జైనూర్ సీఐ రమేష్,ఎస్సై రవికుమార్ ఆధ్వర్యంలో పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుంటూ పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.

Leave a Reply