US Fed Cut : ఆర్బీజీ ఆన్ స్క్రీన్

US Fed Cut : ఆర్బీజీ ఆన్ స్క్రీన్
తెరమీదకు రిజర్వు బ్యాంక్ ఆఫ్ గోల్డ్
అన్ని దేశాల ఫోకస్
తగ్గే ఫెడ్ రేట్.. ఆల్టర్ నేట్ ఇన్ వెస్ట్
అంతర్జాతీయ మీడియా జోస్యం
బంగారం బ్రేక్.. అస్థిరత
సేఫ్ హెవెన్ కే మదుపర్లు మక్కువ
( ఆంధ్రప్రభ, బిజినెస్ డెస్క్)
భారతీయ బులియన్ మార్కెట్ లో బంగారం ధర దోబూచులాటకు తెరపడినట్టే. గత శనివారం నుంచి .. బంగారం తగ్గినట్టే తగ్గి పెరుగుతోంది. ఏ రోజు గోల్డ్ రేట్ తగ్గుద్దో.. పెరుగుతుందో.. అర్థం కాని పసిడి ప్రియులకు ఇక ఒక క్లారిటీ వచ్చేసింది. ఇక బంగారం ధర తగ్గేది లేదు. డాలర్ విలువ అకస్మిక (Gold Rates Hike) హెచ్చు తగ్గుల్లోనే తక్షణ బంగారం ధర మాయం అవుతుంది. గత పది రోజులుగా రిజర్వు బ్యాంకుల వడ్డీ రేట్ల ( US Fed Cut) తగ్గింపుపై నరాలు తెగే ఉత్కంఠను ఎదుర్కొన్న బులియన్ మార్కెట్ ..తాజాగా ఓ నిర్ణయానికి వచ్చేసింది.

ఇక బంగారం ధర దూకుడే దూకుడు అని భావిస్తోంది. రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ఇప్పటికే డిసెంబర్ 5 న రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా మోనిటరీ పాలసీ కమిటీ (RBI ) సమావేశంలో రెపో రేటుని 25 బేసిస్ పాయింట్లు ( Repo Basic Points) అనగా 0.25 శాతం తగ్గిస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా (Sanjay Malhotra) ప్రకటించారు. 3 రోజుల పాటు జరిగిన ఈ భేటీలో ఆర్బీఐ మోనిటరీ పాలసీ కమిటీ వడ్డీ రేట్లని తగ్గించడం మరో విశేషం.
ఇక డిసెంబర్ 9, 10వ తేదీల్లో అమెరికా ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ (America Monitary policy) మోనిటరీ పాలసీ భేటీ జరుగుతోంది. సమావేశం అనంతరం యూఎస్ ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ (Jerom Powel) వడ్డీ రేట్లని 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించినట్టు ప్రకటిస్తారని మీడియా సంస్థలు ముందస్తు జోస్యం చెప్పారు. అంతే భారత్‌లో బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.870లు, 22 క్యారెట్ల బంగారం ధర రూ.800లు, 18 క్యారెట్ల బంగారం ధర రూ.650లు పెరిగింది. ఇక బంగారం ధర మరింత పెరిగే అవకాశం ఉంది.

ఆర్బీఐ. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు (Fed rate Cut) తగ్గితే.. బంగారం ధర ఎందుకు పెరుగుతోంది. బంగారం పై పెట్టుబడికి మదుపర్లు ఎందుకు మక్కువ చూపిస్తారు. అదే తరుణంలో.. షేర్ మార్కెట్ వైపు దృష్టి సారిస్తే బంగారం ధర స్థిరంగా ఉంటుందా ? పెరుగుతుందా? ఒకటి నిజం బంగారంపై పెట్టుబడి తగ్గితే ధర తగ్గదు.. కానీ … డాలరు తగ్గితే.. బంగారం కొనుగోళ్లు పెరుగుతాయి. అసలు ఈ తారతమ్యాలు ఎందుకో.. తెలుసుకుందాం.
US Fed Cut : ఫెడ్ వడ్డీ తగ్గితే …

అమెరికా ఫెడరల్ రిజర్వ్ (ఫెడ్) వడ్డీ రేట్లు తగ్గితే.. ఆటోమేటిక్ గా గోల్డ్ రేట్లు పెరిగిపోతాయి. ఇది ఆర్థిక మార్కెట్ డైనమిక్స్‌పై ఆధారపడి ఉంటుంది. 2025లో ఫెడ్ మూడు సార్లు (Three Times) (సెప్టెంబర్, అక్టోబర్, డిసెంబర్‌లో) 0.25% చొప్పున తగ్గించడంతో, బంగారం ధరలు $ 2,600 నుంచి $ 4,200 దాటాయి. మరింతగా బంగారం ధర పెరిగే అవకాశం ఉంది. 2026లో $4,500- నుంచి $5,000) పెరుగుతుందని అంచనా. ఇలా ఎందుకు జరుగుతోంది.
US Fed Cut : అవకాశ వ్యయం

మార్కెట్ లో ప్రధాన విలువను కోల్పోతే.. ప్రత్యామ్నయ విలువను వెతుక్కుంటూ.. కొత్త వ్యయం తెరమీదకు వస్తుంది. ఒక్కొసారి ఈ అవకాశ వ్యయం కూడా తగ్గుతుంది. Opportunity Cost Decreases) ఇక బంగారం ఏ ఆదాయం పెంచదు. అందుకే “నాన్ -ఈల్డింగ్” ఆస్తిగా పరిగణిస్తారు. పెరుగుతున్న వడ్డీ రేట్లు , బాండ్లు లేదా స్టాక్స్ ఇతర పెట్టుబడులు ఎక్కువ ఆదాయం ఇస్తాయి, అందుకే బంగారాన్ని కొనుగోలుకు అనాసక్తి కనిపిస్తుంది.
ఇక – ఫెడ్ వడ్డీ కోతతో ద్రవ్బోల్పణం తగ్గి (Real Yields) రియల్ యీల్డ్స్ నెగటివ్ రిజల్ట్స్ (Negetive) కనిపిస్తాయి. అంతే మదుపర్లను బంగారం అట్రాక్టివ్ చేస్తుంది, డిమాండ్ పెరిగి ధరలు పెరుగుతాయి. 2025 డిసెంబర్ 9 న ఫెడ్ కట్ అంచనాతో బంగారం $4,233కు చేరింది, అంటే 0.38% పెరిగింది.
US Fed Cut : US డాలర్ బలహీనత
ఫెడ్ రేట్ తగ్గటంతో.. డాలర్ విలువ పై ప్రభావం పడుతుంది. తక్కువ వడ్డీ రేట్లు (Low Intrest Rates) విదేశీ మదుపర్లను దూరం చేస్తాయి. ఇక – బంగారం ధర డాలర్ విలువతో కోట్ అవుతుంది, డాలర్ బలహీనపడితే (Dollor Weaks) ఇతర కరెన్సీల్లో బంగారం చీప్ అవుతుంది.
US Fed Cut : ఇండియా.. చైనా డిమాండ్

2025లో ఫెడ్ కట్స్ తర్వాత డాలర్ ఇండెక్స్ లో 3-5% తగ్గటంతో.. బంగారం ధర 60% పెరిగింది.ప్రపంచ వ్యాప్తంగా బంగారం కొనుగోళ్లపై సెంట్రల్ బ్యాంకులు ఆసక్తి చూపుతున్నాయి. ఏటా 1000 టన్నుల బంగారాన్ని సెంట్రల్ బ్యాంకులు నిల్వ చేయాలి. ఇండియా (India) విషయానికి వస్తే ఈ ఏడాది 10,800 కోట్ల డాలర్లు,, (రూ.9,72,000 కోట్లు) విలువ చేసే బంగారం కొనుగోలు చేసింది. 64 టన్నుల బంగారం దిగుమతి చేసింది.
ఇక చైనా తన యువాన్ ( Yuvan) కరెన్సీ విలువ పెంచేందుకు వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. బంగారం విలువ తగ్గినప్పుడు భారీగా కొనుగోలు చేస్తోంది. వరుసగా ఈ ఏడాది 12 నెలల పాటు బంగారం కొనుగోలు చేసింది. బంగారం నిల్వలతో యువాన్ విలువ పెంచి.. డాలర్ నిల్వలను తగ్గించే యత్నంలో ఉంది. ఎనీ హౌ వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులన్నీ బంగారం నిల్వలపైనే దృష్టి సారించాయి. అంతర్జాతీయ మార్కెట్ లో డాలర్ బలహీనతే.. ఆయా దేశాల టార్గెట్ అని తెలుస్తోంది.
US Fed Cut : సెంట్రల్ బ్యాంకులు బిజీబిజీ..

– సెంట్రల్ బ్యాంకులు (RBI, PBOC) తక్కువ రేట్ల సమయంలో బంగారం కొంటాయి, ఫెడ్ 25 bps కట్ (90% అవకాశం)తో బంగారం $4,205కు పెరిగింది, సిల్వర్ $60కు చేరింది. హాకిష్ టోన్ (కట్ తర్వాత తక్కువ కట్స్) వల్ల కొంచెం సేల్- ఆఫ్ వచ్చింది. 2000, 2007, 2019 కట్స్ తర్వాత బంగారం 26 నుంచి -39% పెరిగింది. 2024..- 25లో అదే స్థితి కనిపించింది. సెప్టెంబర్ వడ్డీ రేట్ కట్ తర్వాత బంగారం ధర $2,789కు చేరింది.
ఇక భవిష్యత్తులో 2026 లో మరో 1-2 కట్స్‌తో బంగారం $4,500 పైకి చేరుతుందని విశ్లేషకుల అంచనా. తెరమీదకు సేఫ్ -హెవెన్ -వడీ రేట్ కట్స్ తో తరచుగా ఆర్థిక మందగింపు, ద్రవ్యోల్బణం, అనిశ్చితి వాతావరణం. బంగారం వైపు మదుపర్లను మళ్లిస్తుంది. తాజాగా బంగారం ట్రెండ్ సేఫ్ హెవెన్ దిశలో (Safe Heaven) పయనిస్తోంది. ఫలితంగా బంగారం ధరలు పెరుగుతాయి. రీసెషన్ భయాల వల్ల 2025లో ఫెడ్ కట్స్ వచ్చాయి, బంగారాన్ని $4,200కు తీసుకెళ్లాయి.
ALSO READ : Gold in Heven : బంగారం దాచేయ్..
Also READ : Gold Tenalize : కాస్త నీరసం
