డిసెంబర్ : బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ జైపూర్‌లో వేగం పుంజుకుంది. మోటార్ క్రీడ, ఫ్యాషన్ ఒకే వేదికపై కలిసిన ఈ కార్యక్రమం పరిమితులను అధిగమిస్తూ, రేసింగ్ ప్రేరణతో రూపొందించిన డిజైన్లు, అద్భుతమైన పెర్ఫార్మెన్స్ వేర్, ఉత్సాహభరితమైన ఫ్యాషన్ ప్రదర్శనలను ఆవిష్కరించింది. ఇవి ‘ఫ్యాషన్ తదుపరి ధోరణి’గా గుర్తింపబడ్డాయి. వేగం, ఖచ్చితత్వానికి ప్రతీకగా నిలిచాయి.
ఫ్యాషన్ డిజైన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (FDCI) సహకారంతో, స్టైల్, పవర్లతో కూడిన వేగవంతమైన సర్క్యూట్‌ను ఈసారి వినూత్నంగా పునర్చిత్రీకరించారు. ప్రముఖ డిజైనర్లు నమ్రతా జోషిపుర, అభిషేక్ పట్నీ మోటార్-కోర్ సౌందర్యాన్ని కొత్త కోణంలో నిర్వచించారు. రేసింగ్ సంస్కృతిని ఫ్యాషన్ స్టేట్మెంట్గా మార్చిన ఈ షోలో బాలీవుడ్ స్టార్ హర్నాజ్ సంధు ఫినాలే షోస్టాపర్‌గా మెరిశారు. అందం, వేగం కలయికను ఆమె అద్భుతంగా ప్రతిబింబించగా, ర్యాప్ సెన్సేషన్ రఫ్తార్ తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్తో ఆరంభం నుండి ముగింపు వరకు ఉత్సాహాన్ని నింపారు.
త్రీ-ల్యాప్ రన్‌వే అనుభవంతో షో ప్రారంభమైంది. ది స్టార్ట్ లైన్లో రేసింగ్ సిల్హౌట్స్ నుండి ది పిట్ లేన్‌లో క్రోమ్ ప్రేరేపించిన ఆభరణాత్మక రూపాలు, చివరిగా హై-ఎనర్జీ నైట్-థీమ్ సౌందర్యంతో పాటు ఉల్లాసభరితమైన స్పోర్ట్స్ కార్ల స్టంట్స్ వరకూ మొత్తం అనుభవం ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఈ ప్రదర్శన భారతదేశం సృజనాత్మకతను, వేగవంతమైన ఆవిష్కరణలను, స్పందనాత్మక సంస్కృతిని ప్రతిబింబించింది. బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ భారత్ ఫ్యాషన్‌ను అత్యంత వేగంతో ముందుకు నడిపించే ఇంజన్‌గా నిలిచింది.
దేబాశ్రీ దాస్ గుప్తా, CMO, పెర్నాడ్ రికార్డ్ ఇండియా మాట్లాడుతూ… “ఫ్యాషన్, సాంస్కృతిక ధోరణులను తీర్చిదిద్దడంలో బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ ఎప్పుడూ ముందుంటుంది. జైపూర్ ఎడిషన్‌లో మేము మోటార్ క్రీడ, హై-ఫ్యాషన్‌ను సమ్మిళితం చేసి, సహసభరితమైన, శైలి నింపిన, ఆవిష్కరణాత్మక అనుభవాన్ని సృష్టించాము’’ అన్నారు.
డిజైనర్ అభిషేక్ పట్నీ మాట్లాడుతూ… “సృజనాత్మకతకు హద్దులు లేవని మరోసారి నిరూపించింది ఈ టూర్. మేము ఫ్యాషన్‌ను కొత్త వేగానికి తీసుకెళ్లి, దాని భవిష్యత్తు వేగం, శైలిలో ఉందని చూపించాము’’ అన్నారు.
డిజైనర్ నమ్రతా జోషిపుర.. “హాట్-కౌచర్ ఆకర్షణను మోటార్ క్రీడల ఖచ్చితత్వంతో కలపడంలో ఈ టూర్ మమ్మల్ని ప్రేరేపించింది. ఇది ఫ్యాషన్ యొక్క తదుపరి అభివృద్ధిని నిర్వచించే ప్రయోగం’’ అన్నారు.
హర్నాజ్ సంధు… “ఈ ఫ్యాషన్ రన్‌వే నాకు రేస్ ట్రాక్‌పై నిలిచిన భావన కలిగించింది. ఉల్లాసం, ఆత్మవిశ్వాసం, ధైర్యవంతమైన శైలికి ఇది ప్రతీక’’ అన్నారు.
ర్యాపర్ రఫ్తార్.. “ఫ్యాషన్‌ను వేగం, శక్తితో ముందుకు నడిపించిన ఈ టూర్ నిజంగా కొత్త ట్రాక్‌ను ప్రారంభించింది’’ అన్నారు.
సునీల్ సేథీ, ఛైర్మన్, FDCI…. “ఫ్యాషన్ భవిష్యత్తును నిర్మించే ప్రయాణంలో బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్‌తో పని చేయడం మా అదృష్టం. జైపూర్ ఎడిషన్ భారత ఫ్యాషన్ సృజనాత్మకతను కొత్త దిశలో సెటప్ చేసింది’’ అన్నారు.
టూర్ ఇకపై కొలకత్తా వైపు పయనిస్తోంది. డిసెంబర్ 20న డిజైనర్ అనామికా ఖన్నా తన ప్రత్యేక పనితనాన్ని సమకాలీన కోణంలో ఆవిష్కరిస్తారు. షోకు ప్రధాన ఆకర్షణగా ఇషాన్ ఖట్టర్ పాల్గొననున్నారు.

