Polling | పోలింగ్ పంపిణీ కేంద్రాల ప‌రిశీల‌న‌…

Polling | పోలింగ్ పంపిణీ కేంద్రాల ప‌రిశీల‌న‌…

Polling | రాయపోల్, ఆంధ్రప్రభ : గ్రామపంచాయతీ ఎన్నికలు–2025 మొదటి విడత పోలింగ్(Polling) ఏర్పాట్లను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె. హైమావతి మంగళవారం పరిశీలించారు. మండల కేంద్రం రాయపోల్ జీఎల్ఆర్ గార్డెన్, దౌల్తాబాద్ మండలం మోడల్ స్కూల్‌లలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్(distribution)–రిసెప్షన్ సెంటర్లలో పోలింగ్ మెటీరియల్ పంపిణీని ఆమె సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ—పీఓ, ఓపీఓలు అందజేసిన మెటీరియల్‌ను పూర్తిగా చెక్ చేసుకోవాలని, బ్యాలెట్ పేపర్లను లెక్కబెట్టుకోవాలని సూచించారు.స్టేషన్లకు చేరుకున్న వెంటనే ఫర్నిచర్, బ్యాలెట్ బాక్స్(ballot box) తదితర వ్యవస్థలను సిద్ధం చేయాలని,గురువారం ఉదయం 6 గంటలకు మాక్‌పోల్ పూర్తి చేసి 7 గంటలకు ఓటింగ్ ప్రారంభించాలని ఆదేశించారు.

ప్రతి రెండు గంటలకు పోలింగ్ శాతం తెలియజేయాలని చెప్పారు.మధ్యాహ్నం 1 వరకూ ఓటర్లు ఉంటే వారందరికి ఓటు వేయనివ్వాలని, అనంతరం బ్యాలెట్ బాక్సులపై సీల్ వేసి మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్(counting) ప్రారంభించాలని తెలిపారు. కౌంటింగ్ సెంటర్లలో మొబైల్‌లకు అనుమతి లేదని, పూర్తిస్థాయి పారదర్శకతతో కౌంటింగ్ జరిపి పై అధికారుల అనుమతితోనే ఫలితాలు ప్రకటించాలన్నారు.

Leave a Reply