Vinod Rao | సర్పంచ్ అభ్యర్థి బానోత్ జయకు బీజేపీ మద్దతు

Vinod Rao | సర్పంచ్ అభ్యర్థి బానోత్ జయకు బీజేపీ మద్దతు
- ఖమ్మం పార్లమెంట్ బీజేపీ పార్టీ అభ్యర్థి,
- రాష్ట్ర నాయకులు తాండ్ర వినోద్ రావు
Vinod Rao | జూలూరుపాడు, ఆంధ్రప్రభ : పడమట నర్సాపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నికల్లో (Election) పోటీ చేస్తున్న బానోత్ జయను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని బీజేపీ పార్టీ రాష్ట్ర నాయకులు, ఖమ్మం పార్లమెంట్ నియోజక వర్గం పార్టీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు పిలుపునిచ్చారు. బుధవారం మండలంలోని పడమట నర్సాపురం గ్రామంలో బీఆర్ఎస్, టీడీపీ పార్టీలు బలపరచిన బానోత్ జయ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ ఎన్నికల్లో బీజేపీ మద్దతు ఉంటుందని వినోద్ రావు ప్రకటించారు.
బానోత్ జయ విజయాన్ని కాంక్షిస్తూ త్వరలో ప్రచారం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. గ్రామ అభివృద్ధికి పాటుపడే బానోత్ జయకు ఓట్లు వేసి గెలిపించాలని పడమట నర్సాపురం గ్రామ పంచాయతీ ప్రజలకు తాండ్ర వినోద్ రావు (Vinod Rao) విజ్ఞప్తి చేశారు. అభ్యర్థి భర్త హరీష్ కు వినోద్ రావు శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు భూక్యా రమేష్, రామారావు, నాగ శ్రీను, భూక్య రవి, సురేష్, వెంకట్రాం, రామకోటి, మాన్సింగ్, టిక్యా, సురేష్,తిరుమల రావు , నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.
