Kammarpally | ఎంపీటీసీగా అనుభవముంది…

Kammarpally | ఎంపీటీసీగా అనుభవముంది…
సర్పంచ్ గా గెలిపించండి.. కొత్తపల్లి హరిక అశోక్
Kammarpally | కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ : కమ్మర్ పల్లి మండల కేంద్రంలో కొత్తపల్లి హరిక అశోక్ తమకు ఎంపీటీసీగా అనుభవముందనీ, సర్పంచ్ గా ఆశీర్వదించి.. గెలిపించండి.. అంటూ బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిని కొత్తపల్లి హరిక అశోక్ బుధవారం కోరారు. గ్రామంలో ఇంటింటి ప్రచార కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నికల అధికారులు కేటాయించిన బ్యాట్ గుర్తుకు గ్రామ ప్రజలు తమకు ఓటు వేయాలని కోరారు. ఇదివరకు ఎంపీటీసీగా.. గ్రామ ప్రజలకు తాము సహాయ, సహకారాలు అందించడం జరిగిందని, అదే అనుభవంతో గ్రామ సర్పంచ్ గా సైతం గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ధి చేస్తానన్నారు.
గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని, గ్రామంలో త్రాగునీటి సమస్య, డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరుస్తానన్నారు. సర్పంచ్ గా గెలిచిన తర్వాత అర్హులైన ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందిస్తానని.. ఆమె భరోసా కల్పిస్తున్నారు. గ్రామస్తులంతా స్వయంగా ఆమె కోసం వాడవాడలా ప్రచారం చేస్తున్నారు. నిరుపేద ప్రజల కోసం ఎల్లవేళలా అండగా ఉంటానని.. గ్రామంలో యువత, మహిళల అభివృద్ధికి ప్రత్యేక ప్రోత్సాహకం అందిస్తానని ఆమె తెలిపారు. ప్రజలందరికీ అందుబాటులో ఉంటానని.. ఒక్కసారి ఆశీర్వదించి అవకాశం కల్పించాలని కోరారు. గ్రామాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా తీర్చిదిద్దుతానని ఆమె తెలిపారు. ప్రజలు మెచ్చేలా, ప్రజలు విశ్వసించేలా పాలకురాలుగా కాకుండా, సేవకురాలిగా పనిచేస్తానని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
