poor people | అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తా

poor people | అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తా
poor people | మంథని, ఆంధ్రప్రభ : తొలిసారిగా ప్రజా సేవకు అంకితం అవుదామనే ఉద్దేశంతో ప్రజా జీవితంలోకి అడుగుపెడుతున్నానని ఆశీర్వదించాలని జాడి రామస్వామి కోరుతున్నారు. మంథని మండలం ఆరెందా గ్రామం నుంచి సర్పంచ్ అభ్యర్థి రామస్వామి బరిలో ఉన్నారు. కత్తెర గుర్తుకు ఓటెయ్యాలని, ప్రజల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటానని ఆయన తెలుపుతున్నారు.
గ్రామంలో నిరుపేద ప్రజలకు(poor people) అందుబాటులో ఉంటానని, అవకాశం కల్పించాలని ఆయన కోరుతున్నారు. ఆరెందా గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని ఆయన తెలిపారు. ఈసారి ఎన్నికల్లో రామస్వామి గెలుపు పక్క అని ప్రజలు విశ్వసిస్తున్నారు. ఆరెందా గ్రామంలో ఏ నోటా విన్న రామస్వామి గెలుపు మాటే వినిపిస్తుంది.
ఎన్నికల్లో కత్తెర గుర్తుకు ఓటేస్తే కష్టాలన్నీ తీరుస్తానని ఆయన మాటిస్తున్నారు. గ్రామంలో డ్రైనేజీ(drainage) వ్యవస్థను పునరుద్ధరిస్తానని, రోడ్లను, మురికి కాల్వలను మరమ్మత్తు చేయించి అభివృద్ధి చేస్తానని ఆయన పేర్కొన్నారు. మహిళల, యువత అభివృద్ధికి ప్రోత్సాహం(encouragement) అందిస్తానని ఆయన తెలిపారు. పరిపాలకునిగా కాకుండా సేవకునిగా అంకితభావంతో పనిచేస్తానని ఆయన తెలిపారు. అవసరమైనప్పుడు వైద్య శిబిరాలని ఏర్పాటు చేసి ప్రజలకు నాణ్యమైన పరిపాలన అందిస్తానని హామీ ఇస్తున్నారు.
