Vira | ఆ వార్డులో హోరాహోరీ

Vira | ఆ వార్డులో హోరాహోరీ
- గన్నవరం 5వ వార్డు ఎన్నికపై ఆసక్తి
- 30 ఏళ్ల తర్వాత తొలిసారి జనరల్ కు కేటాయింపు
Vira | వైరా, ఆంధ్రప్రభ : వైరా మండల పరిధిలోని గన్నవరం గ్రామంలో ఐదో వార్డు ఎన్నికపై ఆ గ్రామ ప్రజలు ఉత్కంఠ గా.. ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. ప్రస్తుతం ఆ వార్డుపై హాట్ టాపిక్‌గా మారింది. 30 ఏళ్ల తర్వాత మళ్లీ తొలిసారిగా ఆ వార్డు ఓసి జనరల్‌కు కేటాయించడం గ్రామస్తులు ఆసక్తికి కారణంగా నిలుస్తుంది. అంతేకాక ఆ గ్రామ నాయకులు వేమిరెడ్డి కోటిరెడ్డి తమ్ముడు.. కుమారుడు బీఆర్ఎస్, జనసేన, టీడీపీ, సీపీఎం, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిగా వేమిరెడ్డి రమేష్ రెడ్డి ఆ వార్డులో పోటీలో ఉండటం కూడా ఆసక్తికి మరో కారణంగా నిలిచింది. విద్యావంతుడు సమస్యలపై అవగాహన తోపాటు.. మంచి ఆలోచన విధానం.. ప్రతి ఒక్కరితో సానుకూల పరిచయాలు ఉండటంతో ఆ వార్డు లో ఎన్నికల వాతావరణ వేడెక్కింది. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఇరువురు ఆ పోటీలో ఉన్నారు. 210 ఓట్లు గల ఆ వార్డులో యువకుడైన రమేష్ రెడ్డి వైపు ఆ వార్డులో ఓటర్లు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. గతంలో మాజీ సర్పంచ్ వేమిరెడ్డి విజయలక్ష్మి కోటిరెడ్డి ఆ వార్డుకు చేసిన సేవలు కూడా రమేష్ రెడ్డిని గెలుపు గుర్రం ఎక్కించేందుకు దోహదపడతాయనే విషయంపై సర్వత్రా చర్చలు జరుగుతున్నాయి.
