MLA | తండాను ఆదర్శంగా తీర్చిదిద్దుతా..

MLA | తండాను ఆదర్శంగా తీర్చిదిద్దుతా..
MLA | పెద్దవంగర, ఆంధ్రప్రభ : 14వ తేదీన జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉంగరం గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించి సర్పంచ్ గా గెలిపిస్తే .. రామచంద్రు తండా గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి నియోజకవర్గం(Constituency)లో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి జాటోత్ వెంకన్న అన్నారు. ఈ రోజు తండాలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జాటోత్ నెహ్రూ నాయక్ తో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఈసందర్భంగా జాటోత్ నెహ్రూ నాయక్ మాట్లాడుతూ.. సమస్యల పరిష్కారం, అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని సర్పంచ్ అభ్యర్థి వెంకన్న ప్రజలకు అందుబాటులో ఉంటూ కంటికి రెప్పలా కాపాడుకుంటాడన్నారు. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి(MLA Yashaswini Reddy) సహాయ సహకారాలతో తండాను అభివృద్ధి చేస్తాడని, డిసెంబర్ 14 న జరిగే సర్పంచ్ ఎన్నికల్లో ఉంగరం గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు.
