Rs. 30 lakhs | పసిడి ప్లాన్ రివర్స్..

Rs. 30 lakhs | పసిడి ప్లాన్ రివర్స్..
Rs. 30 lakhs | ఓబుళదేవరచెరువు, ఆంధ్రప్రభ : ఓ అందమైన ఖరీదైన కారు బెంగళూరు నుంచి గోరంట్లలోకి ప్రవేశించింది. ముగ్గురు వ్యక్తులు అందులో నుంచి దిగి ఒక బ్యాంకు(Bank) వద్దకు వెళ్లారు. మరో ముగ్గురు అదే కారులో ఓబుళదేవర చెరువుకు చేరుకున్నారు. పథకం ప్రకారం.. తమతో తెచ్చుకున్న నకిలీ బంగారంతో రుణం పొందేందుకు బ్యాంకులోకి ప్రవేశించారు. అనుమానం వచ్చిన బ్యాంకుల అధికారులు అప్రమత్తమై గేట్లు మూసేశారు. ఇదేదో సినిమా కథ కాదు. మంగళవారం జిల్లాలో జరిగిన సంఘటన.
ఖాతాలు లేకపోయినా..

బ్యాంకులో రుణం తీసుకోవాలంటే ఇక్కడే ఖాతాలు ఉండాలి. అందువల్ల ఇద్దరు స్థానికులతో మాట్లాడి వారి పేరుతో రుణం తీసుకునేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. గోరంట్లలో తాము తీసుకొచ్చిన 16 తులాల బంగారం(16 taels of gold) బ్యాంకు సిబ్బందికి చూపించారు. అది నకిలీదిగా గుర్తించిన సిబ్బంది అప్రమత్తమై.. గేట్లు వేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఓబుళదేవరచెరువు లోనూ అక్కడి బ్యాంకు సిబ్బంది అప్రమత్తమై గేట్లు వేసేలోపు ఇద్దరు పరారయ్యారు. ఒకరు మాత్రం చిక్కారు. పోలీసులకు సమాచారం అందడంతో విచారణ చేస్తున్నట్లు సమాచారం. రెండుచోట్ల బ్యాంకు అధికారులు ఒకేసారి అప్రమత్తం కావడానికి కారణం.. గతంలోనూ ఇదే మాదిరి నకిలీ బంగారం(fake gold) కుదువ పెట్టి మోసం చేసినట్లు గుర్తించడమేనని తెలిసింది.
గతంలోనూ ఇదే తరహాలో..
ఓబుళదేవరచెరువులో గతనెల బెంగళూరుకు చెందిన కొందరు వ్యక్తులు మండలంలోని డబురువారిపల్లికి చెందిన ఓ రైతు ద్వారా వడ్డాణం కుదువ పెట్టించి రూ.30 లక్షలు(Rs. 30 lakhs) రుణం పొందినట్లు తెలిసింది. మంగళవారం ఇదే మాదరి 20 తులాల బంగారు ఆభరణాలు తీసుకొచ్చి రుణం కావాలని అడిగారు.
గతంలో కుదువ పెట్టిన వడ్డాణంలో కొంత బంగారం.. ఎక్కువశాతం గిల్టు ఉండటంతో ఆలస్యంగా గుర్తించిన అధికారులు ఈసారి ముందుగానే అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం గోరంట్లలో ముగ్గురు, ఓబుళదేవరచెరువులో ఒకరు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది. గతంలో చేసినవారు, ప్రస్తుతం వచ్చినవారు ఒకరేనా..? ఇంతకు ముందు ఇలాంటివి చేశారా? వీరికి సహకరి స్తున్న స్థానికులెవరు? అన్న విషయాల పై పోలీసులు కూపీలాగుతున్నట్లు సమాచారం.

ALSO READ : America Rice Dispute భారత్ బియ్యంపైనా ట్రంప్ అక్కసు