Anitha | ఆదరించి ఆశీర్వదించండి..

Anitha | ఆదరించి ఆశీర్వదించండి..

  • గ్రామాన్ని అభివృద్ధి పథంలో న‌డిపిస్తా..
  • గుండ్ల ప‌హాడ్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి కదురు అనిత శ్రీనివాస్

Anitha | నల్లబెల్లి, ఆంధ్రప్రభ : ప్రజలు ఆశీర్వ‌దించి సర్పంచ్‌గా గెలిపించాల‌ని కాంగ్రెస్ పార్టీ బ‌ల‌ప‌ర్చిన సర్పంచ్ అభ్యర్థి కదురు అనిత శ్రీనివాస్ కోరారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆశీస్సులతో అసంపూర్తిగా ఉన్న సైడ్ డ్రైనేజీ సీసీ రోడ్ల పనులను, పంచాయతీ భవన నిర్మాణ‌న్ని పూర్తి చేస్తానన్నారు. ప్రభుత్వ నిధులతో అభివృద్ధి చేస్తాన‌న్నారు. గ్రామంలో కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచార నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గ్రామంలో అర్హులైన వారికి పెన్షన్స్, ఇందిరమ్మ ఇళ్లను ఇప్పించేందుకు కృషి చేస్తాన‌న్నారు.

Leave a Reply